AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kingdom Trailer Launch: తిరుపతిలో రౌడీ హీరో.. విజయ్ అభిమానుల హంగామా

Rajeev Rayala
|

Updated on: Jul 28, 2025 | 1:16 PM

Share

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్ డమ్ సినిమా కోసం ప్రేక్షుకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ఫ్యామిలీ మ్యాన్ సినిమా తర్వాత విజయ్ చిన్న గ్యాప్ తీసుకొని ఇప్పుడు కింగ్ డమ్ సినిమాతో రాబోతున్నాడు. మళ్ళీ రావా, జెర్సీ మూవీ లాంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండటంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

‘కింగ్‌డమ్’.. విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇది. స్పై యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కింది. జులై 31న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతుంది ఈ మూవీ.  ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది కింగ్ డమ్ మూవీ. హిందీలో ఈ చిత్రం ‘సామ్రాజ్య’ అనే టైటిల్‌తో విడుదలవుతుంది. కింగ్ డమ్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. జులై 26, 2025న తిరుపతిలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ‘కింగ్‌డమ్’ చిత్రం విజయ్ దేవరకొండ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ సినిమా విజయ్ కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు.

Published on: Jul 26, 2025 08:14 PM