చరణ్, పవన్, నానిలను దాటి.. కేరళ బాక్సాఫీస్ దగ్గర విజయ్ రాంపేజ్
టాలీవుడ్‌లో కెరీర్ మొదలెట్టిన విజయ్ దేవరకొండ.. రిజెల్ట్ తో సంబంధం లేకుండా తన సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన రీసెంట్ రిలీజ్ కింగ్డమ్ మూవీతో ఏకంగా కేరళలో కూడా పాగా వేసేశాడు. కింగ్డమ్‌తో... కేరళ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను పట్టేయడమే కాదు..
ఈ సంవత్సంర మల్లూవుడ్‌లో రిలీజ్ అయిన తెలుగు హీరోల సినిమాల కలెక్షన్స్ అన్నింటినీ.. తన కింగ్డమ్ సినిమాతో బీట్ చేశాడు విజయ్. అంతేకాదు ఈ ఫీట్‌తో అటు కేరళలో కూడా హాట్ టాపిక్ అవుతున్నాడు Vd. కింగ్డమ్ సినిమాతో.. కేరళ బాక్సాఫీస్ దగ్గర ఈ సంవత్సరం రిలీజ్ అయిన తెలుగు సినిమాల హీరోల కంటే.. ఎక్కువ కలెక్షన్స్ సాధించేశాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ సంవత్సరం అంటే 2025లో రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ మూవీ కేరళ బాక్సాఫీస్ దగ్గర 23లక్షలు కలెక్ట్ చేయగా… నాని హిట్ 3 మూవీ 21 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన మంచు విష్ణు కన్నప్ప మూవీ 26 లక్షలు కలెక్ట్ చేయగా.. పవన్ హరి మర వీరమల్లు మూవీ కేవలం 8 లక్షలు మాత్రమే వసూళు చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల మధ్య జులై 31 న రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ… కేరళ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 50 లక్షలకు పైగా డే1 కలెక్షన్స్ సాధించింది. ఈ ఫీట్‌తో 2025లో కేరళలో రిలీజ్ అయిన తెలుగు హీరోల సినిమాల కంటే ముందు వరుసలో నిలిచింది విజయ్ కింగ్డమ్ మూవీ. దీంతో విజయ్‌కు కూడా కేరళలో మంచి మార్కెట్ క్రియేట్ అయిందని.. ఇది విజయ్ అప్‌కమింగ్ సినిమాలకు బిగ్ ప్లస్ గా మారే ఛాన్స్ ఉందని ఫిల్మ్ అనలిస్టులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొబ్బరికాయల రాసి నుంచి వింత శబ్దాలు.. అక్కడ చూసేసరికీ త్రాచుపాము బుసబుసలు.. చివరకు
ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా
చేయి పట్టి పైకి లాగారు.. అంతే.. స్టెప్పులతో ఇరగదీసింది
ఆ ఊరిలో 60 ఏళ్ళు దాటిన వ్యక్తి ఒక్కరూ బతికి లేరు.. అదే కారణమా?
ఇళ్లకు తాళాలు వేయరు.. క్రైమ్ రేట్ చాలా తక్కువ.. ఎక్కడంటే..?