మహా కుంభమేళాలో నారా రోహిత్ కు కాబోయే భార్య వీడియో
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా ముగియనుంది. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కి జనం పోతెత్తుతున్నారు. నటీనటులు కూడా మహాకుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానం చేసి వస్తున్నారు. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ, సంయుక్త మీనన్ ఇతర సెలబ్రిటీలు మహాకుంభమేళాలో సందడి చేశారు. తాజాగా మరో నటి మహా కుంభమేళాలో దర్శనమిచ్చింది. ఆమె టాలీవుడ్ లో ఒక్క సినిమానే చేసింది. అయినా ఎందుకు అంత ప్రత్యేకం అంటే.. ఆ చిన్నది త్వరలోనే నారావారి కోడలుగా మారబోతుంది. ఇప్పుడు ఆమె ఎవరో తెలిసిందా.. ? నారా రోహిత్ ను వివాహమాడే చిన్నది శిరీష లేళ్ల.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకు నారా రోహిత్ బాణం అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన సిరినే రోహిత్ వివాహం చేసుకోనున్నాడు. గతేడాది అక్టోబర్ లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య హైదరాబాదులో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. నారా, నందమూరి కుటుంబాలు మాత్రమే ఈ ఎంగేజ్ మెంట్ కు హాజరయ్యాయి. శిరీష ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివి అక్కడే కొంతకాలం ఉద్యోగం కూడా చేసింది. అయితే సినిమాలలో నటించాలనే కోరికతో జాబ్ వదిలేసి హైదరాబాద్ కి వచ్చి తన అక్క ప్రియాంక వద్ద ఉంటూ సినిమాలలో నటించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే నారా రోహిత్ తో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది.ఎంగేజ్ మెంట్ తరువాత శిరీష మహా కుంభమేళాలో దర్శనమిచ్చింది. చాలా సాదాసీదాగా కనిపించింది. ఎంతో భక్తితో పూజలు నిర్వహించి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకుంది. ఫోటోలు చూసిన అభిమానులు నారావారికి కాబోయే కోడలా.. అస్సలు గుర్తుపట్టలేకపోయామే అని కొందరు.. వదినా.. రోహిత్ అన్నను తీసుకెళ్లలేదా అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
