Venkatesh – Saindhav: 25కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌.! దుమ్మలేపుతున్న వెంకీ సైంధవ్‌..

Updated on: Jan 12, 2024 | 7:39 AM

వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా సైంధవ్. ఇది వెంకీ 75వ సినిమా. దాంతో అభిమానులు మరింత ఆసక్తిగా వేచి చూస్తున్నారు. చాలా రోజుల తర్వాత వెంకటేష్ చేస్తున్న యాక్షన్ సినిమా ఇది. పైగా హిట్, హిట్ 2 లాంటి సినిమాల తర్వాత శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా ఇది. పైగా సంక్రాంతికి వస్తుంది కాబట్టి అంచనాలు మామూలుగా ఉండేకంటే మరింత ఎక్కువయ్యాయి. దానికి తోడు ఈ మూవీ బిజినెస్ కూడా అలాగే జరిగింది. వెంకీ గత సినిమాల నెంబర్లను బ్రేక్ కూడా చేసింది.

వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా సైంధవ్. ఇది వెంకీ 75వ సినిమా. దాంతో అభిమానులు మరింత ఆసక్తిగా వేచి చూస్తున్నారు. చాలా రోజుల తర్వాత వెంకటేష్ చేస్తున్న యాక్షన్ సినిమా ఇది. పైగా హిట్, హిట్ 2 లాంటి సినిమాల తర్వాత శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా ఇది. పైగా సంక్రాంతికి వస్తుంది కాబట్టి అంచనాలు మామూలుగా ఉండేకంటే మరింత ఎక్కువయ్యాయి. దానికి తోడు ఈ మూవీ బిజినెస్ కూడా అలాగే జరిగింది. వెంకీ గత సినిమాల నెంబర్లను బ్రేక్ కూడా చేసింది. ఇక వెంకీ సైంధవ్‌ మూవీ… నైజాంలో 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ చేసింది. సీడెడ్లో 3 కోట్లు, ఆంధ్రాలో 9 కోట్లు .. మొత్తంగా ఏపీ తెలంగాణలో 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సైంధవ్ మూవీ. ఏపీ అండ్ తెలంగాణలో కాకుండా… కర్ణాటక ప్లస్‌ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్లో 4 కోట్లు.. మొత్తంగా వరల్డ్ వైడ్ 25 కోట్ల బిజినెస్‌ చేసింది వెంకీ యాక్షన్ అండ్ ఎమోషనల్ సైంధవ్ మూవీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos