మెగా ఇంట పెళ్లిసందడి.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఫిక్స్

|

Jun 02, 2023 | 9:47 AM

మెగా హీరోల్లో ఒకరైన వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంత మంది ముఖ్యులు మాత్రమే అతిథులుగా ఆహ్వానించినట్లు సమాచారం.

మెగా హీరోల్లో ఒకరైన వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంత మంది ముఖ్యులు మాత్రమే అతిథులుగా ఆహ్వానించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న వీరిద్దరు జూన్ 1న హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆ తర్వాత వీరిద్దరి నిశ్చితార్థంపై మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించనున్నారు. వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి డేటింగ్ చేస్తున్నారనే రూమర్ చాలా కాలంగా ఉన్నదే. ఈ వార్తలనే నిజం చేస్తూ.. ఎట్టకేలకు ముహూర్తం కుదిరిందన్నది సమాచారం. ఇక నిశ్చితార్థం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయట. వధూవరుల దుస్తులు, ఆభరణాలు ప్రముఖ డిజైనర్స్ రూపొందిస్తున్నారని సినీ వర్గాల టాక్. కాగా వీరిద్దరు కలిసి మిస్టర్ మూవీ చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని.. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు ఫిల్మ్ సర్కిల్లో వైరలయ్యాయి. ఇక ఇప్పుడు వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.190 కోట్లు పెట్టి ఇల్లు కొన్న హీరోయిన్..

మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో నిఖిల్.. పోస్టర్ అదుర్స్..

విక్రమార్కుడు సీక్వెల్‌లో ర‌ష్మిక మంద‌న్న.. హీరో ఎవరో తెలుసా ??

ప్రభాస్ ‘ప్రాజెక్టు కె’లో కమలహాసన్ ?? రూ.150 కోట్ల ఆఫర్ లో నిజమెంత ??