గుడ్ న్యూస్ చెప్పిన మెగా జోడీ తొందర్లో అమ్మనాన్నగా
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ! మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొందర్లో తండ్రి కాబోతున్నాడనే విషయంపైనే ముచ్చట. అయితే ఇప్పుడీ టాక్ పై మెగా కాంపౌండ్ నుంచే అఫీషియల్ అప్డేట్ వచ్చింది. తామిద్దరం తొందర్లో తల్లిదండ్రులు కాబోతున్నామంటూ.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఛార్మింగ్ బ్యూటీ లావణ్ త్రిపాఠి..నుంచే ఈ గుడ్ న్యూస్ బయటికి వచ్చింది.
ఎస్ ! 2023లో తమకు ప్రేమను పెళ్లితో నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిన వీరిద్దరూ.. ఇప్పుడు అందరితో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. జీవితంలో మోస్ట్ బ్యూటిఫుల్ రోల్ yet Coming soon అంటూ… ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశారు. దాంతో పాటే వరుణ్ తన రెండు ఫింగర్స్‌కు బుజ్జి షూస్ వేసుకున్న ఫోటోను షేర్ చేశాడు. ఇలా.. తొందర్లో తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే గుడ్ న్యూస్‌ను అందరితో పంచుకున్నారు. ఇక ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దాంతో పాటే మెగా ఫ్యాన్స్ ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. ఓ పక్క చరణ్ మే9 టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనుండడం.. ఇంకో పక్క తమ్ముడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తండ్రి కాబోతుండడంతో… ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ పాట గురించి గమ్మత్తయిన విషయం చెప్పిన చిరు
తాతకు తగ్గ మనవడు !! అరుదైన ఘనత సాధించిన శోభన్ బాబు మనవడు
AI సాయంతో పూర్తి సినిమా తీసిన డైరెక్టర్! అవుట్ పుట్ అదిరిపోయింది