AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana Konidela: 'చిరుత' మా మామయ్యే.! Love you అంటూ ఉపాసన పోస్ట్.. వైరల్.

Upasana Konidela: ‘చిరుత’ మా మామయ్యే.! Love you అంటూ ఉపాసన పోస్ట్.. వైరల్.

Anil kumar poka
|

Updated on: Jan 28, 2024 | 11:58 AM

Share

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. 2024 పద్మ పురస్కారాల్లో భాగంగా చిరుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నత అవార్డు వరించింది. సినీ రంగంలో చేసిన సేవలకుగానూ ఆయనను పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. దీంతో చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా అభినందనులు తెలియజేస్తున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు. ఇక మెగా కోడలు ఉపాసన కూడా.. తన మామ చిరుకు విషెస్ చెప్పింది. కంగ్రాట్యూలేషన్స్‌ డియరెస్ట్ మామయ్య అంటూ..

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. 2024 పద్మ పురస్కారాల్లో భాగంగా చిరుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నత అవార్డు వరించింది. సినీ రంగంలో చేసిన సేవలకుగానూ ఆయనను పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. దీంతో చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా అభినందనులు తెలియజేస్తున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు. ఇక మెగా కోడలు ఉపాసన కూడా.. తన మామ చిరుకు విషెస్ చెప్పింది. కంగ్రాట్యూలేషన్స్‌ డియరెస్ట్ మామయ్య అంటూ… తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. ఇదొక్కటే కాదు.. తాజాగా మరో ట్వీట్‌ చేసి.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఉపాసన.

ఇంతకీ ఆ ట్వీట్‌ ఏంటంటే..! “ఐదు బలమైన వేళ్లు కలిస్తేనే బలమైన పిడికిలి అవుతుంది. ఆయన సినిమాల్లోనే కాదు దాతృత్వంలో…జీవితంలో కూడా.. మా అందరికి నాన్నగా.. మామయ్యగా.. తాతయ్యగా ఉంటారు. అండ్ చిరుత.. honored with #PadmaVibhushan 🙏🙌 Love you” అంటూ తన ట్వీట్లో క్రేజీగా రాసుకొచ్చింది ఉపాసన. అంతేకాదు ఐదుగురు మనవరాళ్లతో.. మనవారాళ్ల మధ్యలో చిరు కూర్చున్న ఫోటోను కూడా షేర్ చేసింది. అయితే ఈ ట్వీట్లో ఉపాసన చిరుత అని.. మెగా స్టార్ చిరు కోట్ చేయడం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మెగా ఫ్యాన్స్‌ ను అయితే క్రేజీగా ఆకట్టుకుంటోంది. చిరుత మామయ్యేనా.. అనే కామెంట్ వారి నుంచి వచ్చేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos