Allu Arjun – Chiranjeevi: మన చిరంజీవి’ అంటూ అల్లు అర్జున్ క్రేజీ రియాక్షన్.. వీడియో.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అనౌన్స్ చేసింది. అయితే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని సత్కరించింది కేంద్రం. దీంతో మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అనౌన్స్ చేసింది. అయితే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని సత్కరించింది కేంద్రం. దీంతో మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పద్మ విభూషణ్ పురస్కారానికి ఈ ఏడాది చిరంజీవి పేరు ప్రకటించడంపై అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు. “దేశంలోనే రెండో అత్యున్నతమైన పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపికైనందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. కుటుంబం, అభిమానులతోపాటు యావత్ తెలుగు వారికి ఇది ఎంతో గర్వకారణం. ఈ విజయంపై సంతోషంగా ఉన్నాను. మేము గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చారు బన్నీ. ప్రస్తుతం ఈ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. మెగా ఫ్యాన్స్‌తో పాటు బన్నీ సోషల్ మీడియా పేజీల్లో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos