లేచింది మహిళా లోకం.. ఆ సినిమాలో ఐదుగురు స్టార్ హీరోయిన్లు

Edited By:

Updated on: Jan 08, 2026 | 5:59 PM

కేజీఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో యష్‌తో పాటు ఐదుగురు స్టార్ హీరోయిన్లు (నయనతార, కియారా సహా) నటిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యష్ పాత్రను, హీరోయిన్లతో అతని సంబంధాన్ని ఎలా చూపిస్తుంది, సినిమా టైటిల్‌కు తగ్గట్టు ఎంత 'టాక్సిక్'గా ఉండబోతుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఈ రోజుల్లో ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లుంటేనే ఇంపార్టెన్స్ లేదని గోల పెడుతుంటారు.. అలాంటిది అసలు టాక్సిక్‌లో ఏం జరుగుతుంది..? ఇందులో ఒకరు ఇద్దరు కాదు.. మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. అందులో ముగ్గురు ప్యాన్ ఇండియా స్టార్స్. ఇంతమంది హీరోయిన్స్ మధ్యలో యశ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది..? కేజియఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత యశ్ చేస్తున్న టాక్సిక్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇందులో ఇద్దరు కాదు, ముగ్గురు కాదు.. ఏకంగా ఐదుగురు స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీస్ కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియాతో పాటు.. లేడీ సూపర్ స్టార్ నయనతార, రుక్మిణి వసంత్ ఇందులో ఉన్నారు. ఇంతమంది హీరోయిన్లతో టాక్సిక్ వరల్డ్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి పెరిగిపోతుంది. వీళ్ళ మధ్యలో యశ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది..? సినిమా టైటిలేమో టాక్సిక్ అని ఉంది.. అంటే రెగ్యులర్ సినిమా అయితే కాదు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ఐదుగురు హీరోయిన్లతో యశ్‌కు ఉన్న రిలేషన్ ఏంటి..? వీళ్లలో యశ్‌కి జోడీ ఎవరు..? విలన్ ఎవరు ఇవన్నీ ఆసక్తి రేపుతున్నాయి. ఇంతమంది హీరోయిన్లు, ఓ పాన్ ఇండియన్ స్టార్‌ని హ్యాండిల్ చేస్తున్న కెప్టెన్ కూడా ఒక లేడీనే.. ఆమెనే గీతూ మోహన్‌దాస్. ఓ లేడీ డైరెక్టర్ ఇంతమంది హీరోయిన్లకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు..? యశ్‌ని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు..? ఈ సెటప్ అంతా చూస్తుంటే.. ఏదో పెద్ద విధ్వంసమే ప్లాన్ చేసినట్టున్నారనిపిస్తుంది. జనవరి 8న యశ్ బర్త్ డే కానుకగా టీజర్ రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మేమే హీరోయిన్స్.. మేమే స్పెషల్ గాళ్స్.. కొత్త ట్రెండ్

పాన్ ఇండియా ట్రెండ్‌కు దూరమవుతున్న బాలీవుడ్‌

Meenakshi Chaudhary: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మీనాక్షి

హిట్ కొట్టాలంటే.. బ్రేక్ కావాల్సిందే అంటున్న క్రేజీ డైరెక్టర్స్‌

Janhvi Kapoor: సౌత్‌ కోసం తన ప్లాంనింగ్ మార్చుకున్న జాన్వీ కపూర్‌

Published on: Jan 08, 2026 05:54 PM