TOP 9 ET: అల్లు అర్జున్ vs అల్లు అర్హ తండ్రికే పోటీ.. | న్యూయార్క్ టైమ్స్ స్వేర్ పై ప్రభాస్..

|

Jul 18, 2023 | 8:32 AM

అభిషేక్‌ బచ్చన్‌ రాజకీయాల్లోకి వస్తారని నార్త్ లో ప్రచారం జరుగుతోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీని గురించి ఇప్పటిదాకా స్పందించలేదు అభిషేక్‌.

01.aLLU aRJUN aLLU aRHA
అల్లు అర్జున్ వారసురాలిగా.. చైల్డ్ ఆర్టిస్ట్ గా శాకుంతలం పాన్ ఇండియన్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్హ. తాజాగా తన ఫాదర్ పుష్ప 2 సినిమాతో ఢీకొట్టబోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో కామియే అప్పియరెన్స్ ఇస్తున్నా ఈ స్టార్ కిడ్.. 2024 ఏప్రిల్ 5 థియేటర్లలోకి వస్తున్నారు. అయితే అదే మంత్ లో ఐకాన్ స్టార్ పుష్ప ది రూల్ కూడా రిలీజ్ అవుతుందనే టాక్ వస్తుండడంతో.. తండ్రి వర్సెస్ డారట్ అనే టాక్ ఇప్పుడు నెట్టింట వస్తోంది.

02.Prabhas
ఇప్పటికే పాన్ ఇండియన్ స్టార్ గా టాప్ ప్లేస్ లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్.. తాజాగా న్యూయార్క్ టైమ్ స్క్వేర్ పై ప్లాష్ అయ్యారు. జూలై 20నే కామికాన్ వేదికగా ప్రాజెక్ట్ కె వీడియో గ్ంప్స్ రానుందనే అనౌన్స్ మెంట్ తో.. న్యూయార్క్ వీధుల్లో ఉన్న స్కీన్స్ పై కనిపించారు. అయితే న్యూయార్క్ టైమ్ స్వ్కేర్ పై ప్రభాస్ ను చూసేందుకు అక్కడికి భారీగా ప్యాన్స్ రావడం ఇప్పుడు సోషల్ మీడియాను బ్రేక్ అయ్యేలా చేస్తోంది. ప్రభాస్ క్రేజ్ మరింతగా పెరిగిందనే టాక్ వస్తోంది.

03.Baby Collections
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కాంబినేషన్‌లో సాయి రాజేష్ తెరకెక్కించిన సినిమా బేబీ. మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. మూడు రోజుల్లోనే ఈ సినిమా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాదు.. సంచలన విజయం సాధించింది. 8 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన బేబీ.. మూడు రోజులు ముగిసేసరికి 11కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. నాలుగో రోజు కూడా అన్నిచోట్లా హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

04.Bhola shankar
మెగా అభిమానుల్లో చిరు లీక్స్ సందడి కనిపిస్తోంది. ‘భోళా శంకర్‌’కి సంబంధించి ఇంట్రస్టింగ్‌ విషయాన్ని లీక్‌ చేశారు మెగాస్టార్‌. పవన్‌ సినిమాల్లో అప్పుడప్పుడూ తన ప్రస్తావన ఉంటుందన్నారు. తన డ్యాన్సులకి తమ్ముడు స్టెప్పులేస్తుంటారని చెప్పారు. తొలిసారి తాను ‘భోళాశంకర్‌’ సినిమాలో, పవన్‌ మేనరిజాన్ని అనుకరించానని అన్నారు. తమ్ముడి పాట మస్తుందిలే అంటూ చిరు చేసిన సందడి వైరల్‌ అవుతోంది.

05. Jawan
ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత పఠాన్‌తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు షారుక్ ఖాన్. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం అదే జోష్‌తో జవాన్‌తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు కింగ్ ఖాన్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్యే వచ్చిన టీజర్ సినిమాపై హైప్ ఇంకాస్త పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుంచి నయనతార ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్. సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది.

06.Hidimba
ఓంకార్ తమ్ముడు, హీరో అశ్విన్ బాబు నటించిన ‘హిడింబ’ చిత్రం జులై 20న విడుదల కానుంది. ఈ మధ్యే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ సినిమా. అనీల్ కన్నెగంటి తెరకెక్కించిన హిడింబ ట్రైలర్ తాజాగా విడుదల చేసారు మేకర్స్. పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది హిడింబ. ఈ సినిమాలో నందిత శ్వేత హీరోయిన్‌గా నటించారు. సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.

07. Dhruva Natchathiram
విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ధ్రువనక్షత్రం’. రీతు వర్మ నాయికగా నటించారు. 2017లో మొదలైంది ఈ మూవీ. కొంత భాగం షూటింగ్‌ లండన్‌లో చేశారు. 2018లో విడుదల కావాల్సింది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మూవీని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. సెకండ్‌ సింగిల్‌ని ఈ నెల 17న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్.

08.Jailer
రజనీకాంత్‌, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘జైలర్‌’. ఈ చిత్రంలోని రెండో పాట ‘హుకుం..’ ఇవాళ విడుదలవుతోంది. ఈ సందర్భంగా రజనీకాంత్‌ చెప్పిన డైలాగులతో ఓ వీడియో విడుదలైంది. ఈ పాట పులి హుకుంలాగా ఉంటుందని అన్నారు సూపర్‌స్టార్‌. రజనీ మాస్‌ పవర్‌, ఆయన స్టైల్‌ని హైలైట్‌ చేసే పాట ఇది. అనిరుద్‌ సంగీతం అందిస్తున్నారు.

09.Abhishek
అభిషేక్‌ బచ్చన్‌ రాజకీయాల్లోకి వస్తారని నార్త్ లో ప్రచారం జరుగుతోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీని గురించి ఇప్పటిదాకా స్పందించలేదు అభిషేక్‌. ఆయన కేమియో అప్పియరెన్స్ ఇచ్చిన భోళా ఆ మధ్య విడుదలైంది. ఘూమర్‌ షూటింగ్‌ పూర్తయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...