TOP 9 ET: సెన్సేషనల్‌గా సలార్‌.. | యుద్ధం మొదలెట్టిన మెగా పవర్ స్టార్.. టాలీవుడ్ షేక్.!

TOP 9 ET: సెన్సేషనల్‌గా సలార్‌.. | యుద్ధం మొదలెట్టిన మెగా పవర్ స్టార్.. టాలీవుడ్ షేక్.!

Anil kumar poka

|

Updated on: Jul 06, 2023 | 7:41 PM

ఇక ఓ పక్క ప్రభాస్‌ సలార్‌తో.. సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే.. మరో పక్క మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్.. కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. లోకేష్ కనగరాజ్‌.. విజయ్‌ కాంబో.. లియోలో.. మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌.. ఓ పవర్‌ ఫుల్ రోల్ చేయబోతున్నారనే న్యూస్‌తో..

01. Salaar
ద మోస్ట్ అవేటెడ్.. ! ప్రభాస్ పాన్ ఇండియన్ యాక్షన్ ఫిల్మ్‌.. సలార్ నుంచి ఎట్టకేలకు దిమ్మతిరిగే టీజర్ వచ్చేసింది. అందరి స్క్రీన్ల దద్దరిల్లిపోయే రేంజ్‌లో హిట్ చేసింది. ఇక అందులోనే ఉన్న… ! ప్రభాస్‌ బక్లీ కటౌట్‌.. థండర్ యాక్షన్ అందర్లో గూస్ బంప్స్ పుట్టిస్తోంది. ఇక సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పినట్టే.. సోషల్ మీడియాలో ప్రభాస్‌ సలార్ రెబలింగ్ చేస్తోంది. ఎప్పటి నుంచో.. ఈ సినిమా అప్డేట్ కోసమే.. ఈసినిమా టీజర్ కోసమే వెయిట్‌ చేస్తున్న అందరికీ.. కిక్కిస్తోంది.

02. Salaar
ఇక ఎన్నో అంచనాల మధ్య.. ఎర్లీ మార్నింగ్ 5:12కే రిలీజ్‌ అయిన సలార్ టీజర్‌.. సోషల్ మీడియా కీ ప్లాట్‌ ఫాం అయిన యూట్యూబ్‌ను షేక్ చేసేస్తోంది. జెస్ట్ వన్ మినెట్ ఫాటీ సెకండ్స్‌ ఉన్న ఈ టీజర్‌… యూట్యూబ్‌లో కేవలం 9గంట్లలోనే ఏకంగా 25 మిలియన్ వ్యూస్‌ను వచ్చేలా చేసుకుంది. అంతే కాదు.. యూట్యూబ్‌లో నెంటర్ 1గా ట్రెండ్ అవుతోంది. ప్రభాస్‌ రేంజ్‌కు మరో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌ను సెట్ చేసేసింది.

03.Leo
ఇక ఓ పక్క ప్రభాస్‌ సలార్‌తో.. సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే.. మరో పక్క మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్.. కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. లోకేష్ కనగరాజ్‌.. విజయ్‌ కాంబో.. లియోలో.. మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌.. ఓ పవర్‌ ఫుల్ రోల్ చేయబోతున్నారనే న్యూస్‌తో… పీక్స్‌లో బజ్ చేస్తున్నారు. అయితే లియో సినిమాను.. మలయాళంలో రిలీజ్‌ చేస్తున్న.. గోకులం మూవీస్‌ మేకర్స్.. కూడా ఇదే విషయమే చెప్పారు. ఈ న్యూస్‌ పక్కా అనే హింట్ అన్ అఫీషియల్లీ.. అఫీషియల్‌గా ఇచ్చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇర యుద్ధం ఆరంభం అంటూ.. నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

04.Gunturu karam
మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. రీసెంట్‌గా ఓ షెడ్యూల్‌ పూర్తయింది. రేపటి నుంచి మరో షెడ్యూల్‌ మొదలు కానుంది. ఈ షెడ్యూల్‌లో హెవీ డ్యూటీ యాక్షన్‌ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారు. మహేష్‌ పాల్గొంటారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది గుంటూరు కారం.

05. 2 Bro
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సాయితేజ్‌ నటిస్తున్న సినిమా బ్రో. సముద్రకని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఓపాట షూటింగ్‌ కోసం టీమ్ ఆస్ట్రేలియా వెళ్లింది. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. అందమైన లొకేషన్లలో షూటింగ్‌ చేయడం హ్యాపీగా ఉందని అన్నారు సాయితేజ్‌. హిట్‌ ఫిల్మ్ వినోదయ సిత్తానికి రీమేక్‌ ఇది.

06.Dhanush
దనుష్‌ హీరోగా డీ 50 షూటింగ్‌ మొదలైంది. ఈ సినిమాకి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌కి మంచి స్పందన వస్తోంది. ఇటీవల ధనుష్‌ తిరుపతిలో గుండు చేయించుకున్నారు. డీ 50 సినిమా కోసమే ఈ లుక్‌ అనే మాట వైరల్‌ అవుతోంది. సన్‌ పిక్చర్స్ సంస్థ డీ 50ని తెరకెక్కిస్తోంది.

07. kamal
కమల్‌హాసన్‌ హీరోగా హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఇండియన్2 తో బిజీగా ఉన్న లోకనాయకుడు త్వరలోనే వినోద్‌ సెట్స్ కి వెళ్తారు. తన అనుభవాన్ని కొత్త తరానికి నేర్పడానికి, కొత్తవాళ్ల నుంచి నేర్చుకోవడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు కమల్‌. ఈ మూవీకి కథ కూడా ఆయనే అందిస్తున్నారు.

08.thangalan
విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా తంగలాన్‌. చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు హీరో విక్రమ్‌. ”తంగలాన్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేశాను. ఈ మూవీ నా కెరీర్‌లో బ్యూటీఫుల్‌ జర్నీ. నటుడిగా మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది” అని అన్నారు. ఇక కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్ ఫీల్డ్ కార్మికుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతోంది తంగలాన్‌.

09.Tejas
బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా తేజస్‌. షూటింగ్‌ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తేజస్‌ని అక్టోబర్‌ 20న విడుదల చేస్తామంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటనలను గౌరవిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Jul 06, 2023 07:17 PM