TOP 9 ET: గ్రాండ్‌గా వరుణ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ వేడుక | క్రేజీ కాంబో..

TOP 9 ET: గ్రాండ్‌గా వరుణ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ వేడుక | క్రేజీ కాంబో..

Anil kumar poka

|

Updated on: Oct 07, 2023 | 8:32 PM

మెగా ఇంట పెళ్లి భాజాలు మొదలయ్యాయి. మెగా ప్రిన్స్ వరుణ్ లేజ్‌, లావణ్యల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ తాజాగా ఘనంగా జరిగింది. ఈ వేడుక కోసం మెగా కుంటుంబంలోని సభ్యులందరూ ఏకమై హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మెగా స్టార్ చిరు... తన సోషల్ మీడియా హ్యండిల్లో ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే పవన్‌ మాత్రం పాలిటిక్స్‌లో బిజీగా ఉండి ఈ ప్రీ వెడ్డింగ్‌కు రాలేదని తెలుస్తోంది.

01.Boyapati
అప్‌ కమింగ్ సినిమాల విషయంలో క్లారిటీ ఇచ్చారు మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. స్కంద రిలీజ్ తరువాత బాలయ్యతో సినిమా ఉంటున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముందు సూర్య హీరోగా ఓ సినిమా ఉంటుందని తెలిపారు. ఆ తరువాత అఖండ 2 పట్టాలెక్కుతుందని వెల్లడించారు.

02.Varun
మెగా ఇంట పెళ్లి భాజాలు మొదలయ్యాయి. మెగా ప్రిన్స్ వరుణ్ లేజ్‌, లావణ్యల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ తాజాగా ఘనంగా జరిగింది. ఈ వేడుక కోసం మెగా కుంటుంబంలోని
సభ్యులందరూ ఏకమై హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మెగా స్టార్ చిరు… తన సోషల్ మీడియా హ్యండిల్లో ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే పవన్‌ మాత్రం పాలిటిక్స్‌లో బిజీగా ఉండి ఈ ప్రీ వెడ్డింగ్‌కు రాలేదని తెలుస్తోంది.

03. VD 12
ప్రజెంట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వెల్లడించారు. సీక్వల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ కూడా పూర్తయ్యిందని తెలిపారు.

04.Leo
మోస్ట్ అవైటెడ్ లియో ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. ఇందులో త్రిష హీరోయిన్. విజయ్‌తో 14 ఏళ్ళ తర్వాత నటిస్తున్నారు త్రిష. చివరగా 2008లో వీరిద్దరూ కురువిలో కలిసి నటించారు. లియో కచ్చితంగా జైలర్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ అంచనా. ఇదిలా ఉంటే 24 గంటల్లో లియో ట్రైలర్‌కు ఏకంగా 31 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్.

05.Leo
లియో టీమ్ ప్రమోషన్‌ స్పీడు పెంచింది. ఇన్నాళ్లు తమిళ ప్రమోషన్‌ మీదే దృష్టి పెట్టిన యూనిట్‌, ట్రైలర్‌ రిలీజ్ తరువాత మిగత భాషల మీద కూడా కాన్సన్‌ట్రేట్ చేస్తోంది. తాజాగా తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఓ సాంగ్‌ను రిలీజ్ చేసింది టీమ్‌. విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకుడు.

06.MAD
సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ హీరోలుగా తెరకెక్కిన మ్యాడ్ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ వారం సినిమాల్లో సైలెంట్ సెన్సేషన్ ఇది. పూర్తిగా కాలేజ్ నేపథ్యంలో మ్యాడ్ సినిమాను తెరకెక్కించారు కళ్యాణ్ శంకర్. ఈ సినిమా సక్సెస్ మీట్ తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించారు.

07.Yatra 2
యాత్ర 2 ప్రమోషన్‌ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌. ఇప్పటికే ప్రీ టీజర్ వదిలిన మూవీ టీమ్‌, ఈ నెల 9న ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది. తమిళ నటుడు జీవా లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. మహి వి రాఘవ దర్శకుడు.

08. Babulgum
రాజీవ్ కనకాల, యాంకర్ సుమల కుమారుడు రోషన్ ఆరేళ్ళ కింద ‘నిర్మల కాన్వెంట్’ లో నటించారు. అయితే ఇప్పుడు ఈయన హీరోగా పరిచయం అవుతున్నారు. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీల’ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు బబుల్ గమ్ అనే టైటిల్ పెట్టారు. తాజాగా ‘బబుల్ గమ్’ ఫస్ట్ లుక్‌ను రాజమౌళి విడుదల చేశారు.

09.Ayalaan
శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా అయలాన్‌. ఈ సినిమా టీజర్‌ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హీరో, ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్‌ చేశారు. షూటింగ్ అంతా 95 రోజుల్లో పూర్తి చేశామని చెప్పారు. షూటింగ్ పూర్తయిన తరువాత క్వాలిటీ చూసిన రెహమాన్‌, ముందు కంపోజ్ చేసిన సాంగ్స్‌ పక్కన పెట్టేసి మరో మూడు కొత్త ట్యూన్స్ ఇచ్చారని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 07, 2023 08:31 PM