Tollywood Drugs Case : డ్రగ్స్‌ కేసులో కదులుతోన్న డొంక.. మరింత డెప్త్‌గా ఎంక్వయిరీ

Tollywood Drugs Case : డ్రగ్స్‌ కేసులో కదులుతోన్న డొంక.. మరింత డెప్త్‌గా ఎంక్వయిరీ

Rajeev Rayala

|

Updated on: Oct 07, 2023 | 4:28 PM

మాదాపూర్‌లో పట్టుబడిన మత్తు పదార్ధాల కేసులో టాలీవుడ్‌ యాక్టర్‌ నవదీప్‌కు ఈడీ లేటెస్ట్‌గా నోటీస్‌ జారీ చేసింది. ఈ నెల 10 విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సెప్టెంబర్‌ 14 న నార్కొటిక్‌ టీమ్స్‌ మాదాపూర్‌లో 3 నైజీరియన్లు సహా మొత్తం మందిని అరెస్ట్‌ చేశారు. వారిలో బెంగళూరుకు చెందిన పెడ్లర్స్తో పాటు ఓ సినీ డైరెక్టర్‌ ఉన్నారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కూపీ లాగితే టాలీవుడ్ లో డ్రగ్స్‌ కేసులో లింకులు కదులుతున్నాయి. మాదాపూర్‌లో పట్టుబడిన మత్తు పదార్ధాల కేసులో టాలీవుడ్‌ యాక్టర్‌ నవదీప్‌కు ఈడీ లేటెస్ట్‌గా నోటీస్‌ జారీ చేసింది. ఈ నెల 10 విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
సెప్టెంబర్‌ 14 న నార్కొటిక్‌ టీమ్స్‌ మాదాపూర్‌లో 3 నైజీరియన్లు సహా మొత్తం మందిని అరెస్ట్‌ చేశారు. వారిలో బెంగళూరుకు చెందిన పెడ్లర్స్తో పాటు ఓ సినీ డైరెక్టర్‌ ఉన్నారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విచారణలో తెర చాటు మత్తు లింకులు బయటపడ్డాయి. డ్రగ్స్‌ కేసులో నిందితులతో నవదీప్‌ సంపద్రింపులు జరిపినట్టు గుర్తించారు అధికారులు.

డ్రగ్‌ పెడ్లర్‌ రాంచంద్‌ అనే వ్యక్తి నుంచి నవదీప్‌ డ్రగ్స్‌ తీసుకున్నారని.. అందుకు సంబంధించిన ఆధారాలు దొరికాయి.  డ్రగ్‌ రీల్‌లో నవదీప్‌ రోల్‌పై ఇప్పటికే నార్కొటిక్‌ అధికారులు వైడ్‌ యాంగిల్‌లో విచారణ జరిపారు. ఆయన సెల్‌ఫోన్‌ కాల్‌డేటాపై కూడా ఫోకస్‌ పెట్టారు. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఇంకెన్ని సంచనాలు తెరపైకి వస్తాయోననే చర్చ జరుగుతోంది.

డ్రగ్‌ దందాలో నవదీప్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌పై TS న్యాబ్‌ కీలక డేటా సేకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ ఎంటర్‌ అయింది. సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ను మరింత డెప్త్‌గా ఎంక్వయిరీ చేయనున్నారు ఈడీ అధికారులు.

Published on: Oct 07, 2023 04:27 PM