TOP9 ET: జక్కన్నను కలవరపెడుతున్నకల్కి మూవీ | వివాదంలో కల్కీ .. ప్రభాస్ కు లీగల్ నోటీసులు
నిన్న మొన్నటి వరకు రికార్డుల రారాజు జక్కన్న! అన్ బీటబుల్ ఎవర్ గ్రీన్ రికార్డులకు కేరాఫ్. కానీ రీసెంట్‌గా వచ్చిన ప్రభాస్ కల్కి మూవీ జక్కన్న మీద ఉన్న ఈ ట్యాగ్‌ను ఆల్మోస్ట్ గా తుడిచేసింది. దాదాపు చాలా ఏరియాల్లో ట్రిపుల్ ఆర్ రికార్డును బద్దలుకొట్టింది. దీంతో జక్కన్న తన నెక్ట్స్ సినిమాతో.. నయా రికార్డ్స్ సెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆప్టర్ ట్రిపుల్ ఆర్ ఇప్పటికే ఆయనపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్.. అందుకు తోడు పక్కనే ఉన్న మహేష్. ఇప్పుడు కల్కి రికార్డ్స్!
01.rajamouli: జక్కన్నను కలవరపెడుతున్న కల్కీ మూవీ
నిన్న మొన్నటి వరకు రికార్డుల రారాజు జక్కన్న! అన్ బీటబుల్ ఎవర్ గ్రీన్ రికార్డులకు కేరాఫ్. కానీ రీసెంట్‌గా వచ్చిన ప్రభాస్ కల్కి మూవీ జక్కన్న మీద ఉన్న ఈ ట్యాగ్‌ను ఆల్మోస్ట్ గా తుడిచేసింది. దాదాపు చాలా ఏరియాల్లో ట్రిపుల్ ఆర్ రికార్డును బద్దలుకొట్టింది. దీంతో జక్కన్న తన నెక్ట్స్ సినిమాతో.. నయా రికార్డ్స్ సెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆప్టర్ ట్రిపుల్ ఆర్ ఇప్పటికే ఆయనపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్.. అందుకు తోడు పక్కనే ఉన్న మహేష్. ఇప్పుడు కల్కి రికార్డ్స్! దీంతో… ఈ స్టార్ డైరెక్టర్ తన అప్ కమింగ్ సినిమా కోసం ఓ రేంజ్‌లో కష్టపడుతున్నారనే టాక్ తాజాగా బయటికి వచ్చింది.
02.kalki: వివాదంలో కల్కీ మూవీ.. ప్రభాస్‌కు లీగల్ నోటీసులు.
ప్రభాస్ కల్కి మూవీ వివాదంలో చిక్కుకుంది. ప్రభాస్ , అమితాబ్‌కు లీగల్ నోటిసులు వెళ్లే వరకు ఆ వివాదం ముదిరింది. కల్కి మూవీలో కల్కి భగవానుడి గురించి గ్రంథాలకు భిన్నంగా తప్పుగా చూపించారని కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం తాజాగా కోర్టు మెట్లెక్కారు. ప్రభాస్, అమితాబ్‌తో పాటు ఈ మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపారు. దీపిక కృత్రిమ గర్భధారణ ద్వారా కల్కి పుట్టబోతున్నట్లు చూపించి వందల కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు. అంతేకాదు హిందూ గ్రంథాలను సినిమాల్లో కథలుగా వాడుకోవడం.. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందంటూ.. ఆచార్య ప్రమోద్ కృష్ణం ఫిల్మ్ మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తి చేశారు.
03. kalki: బాలీవుడ్‌లో ఆగని.. కల్కీ కలెక్షన్స్ ప్రభంజనం.
కల్కి కలెక్షన్స్ బాలీవుడ్లో ప్రభంజనం సృస్టిస్తోంది. కల్కి మూవీ రిలీజ్ అయిన దాదాపు 20ప్లస్ డేస్ అవుతున్నా కూడా.. థియేటర్లలో ఈ మూవీకి నెస్పాన్స్ ఏమాత్రం తగ్గకపోవడం బీ టౌన్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక దానికి తోడు.. ఈ మూవీ హిందీ ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్‌ను కూడా బీట్ చేయడం ఇప్పుడో క్రేజీ న్యూస్ గా మారింది. అప్పట్లో హిందీలో ట్రిపుల్ ఆర్ 272.78 కోట్లు వసూలు చేయగా… తాజాగా 4 వారాల్లోనే కల్కి ఆ మొత్తాన్ని వసూలు చేసింది. స్టిల్ కాంన్‌స్టాంట్ కలెక్షన్స్‌తో నార్త్‌లో దూసుకుపోతోంది.
04. netflix: రిలీజ్ అయిన జక్కన్న జీవిత చరిత్ర ట్రైలర్.
టాలీవుడ్‌ను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లిన జక్కన్న పై నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని ప్లాన్ చేసింది. అప్పట్లో అనౌన్స్ చేసి.. ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇక ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్‌లో.. తన హీరోలు ప్రభాస్, రామ్ చరణ్ , ఎన్టీఆర్ తో పాటు మరికొంత మంది జక్కన్న గురించి ఏం చెప్పారో శాంపిల్‌గా చూపించారు మేకర్స్. అంతే కాదు ఈ డాక్యుమెంటరీ ఆగస్ట్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవనున్నట్టు.. ఈ ట్రైలర్‌లోనే రివీల్ కూడా చేశారు.
05.ntr: రాజమౌళి ఓ పిచ్చోడు.!
06.mega films: ముచ్చటగా ముగ్గురు మెగా ఫ్యాన్స్‌కు పండగే.. పండగ..!
తొందర్లో మెగా ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతోంది. మెగా హీరోతో పాటు.. మరో ఇద్దరు స్టార్ హీరోలు.. కొన్ని రోజుల తేడాతో థియేటర్లో సందడి చేయబోతున్నారు. ఇక అందులో మొదటగా అల్లు అర్జున్ పుష్ప2 మూవీతో డిసెంబర్ 6న.. థియేటర్లలోకి వస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో డిసెంబర్ 25 వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక దాదాపు రెండు వారాల గ్యాప్ తో.. సంక్రాంతి కానుకగా.. జనవరి 10న..చిరు విశ్వంభరతో.. తన విశ్వరూపం చూపించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఎప్పుడూ లేనిది.. ఈ ముగ్గురు ఇలా దగ్గర దగ్గరగా రావడం.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు అతి పెద్ద పండగగా మారింది.
07.pakisthani: ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా పాకిస్తాన్ బ్యూటీ..
నిన్న మొన్నటి వరకు ఆన్ స్క్రీన్ పై… నార్త్ బ్యూటీలతో మాత్రమే రొమాన్స్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు బార్డర్ దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి తన అప్ కమింగ్ సినిమాలో.. ఏ హాలీవుడ్ బ్యూటీనో.. యూరప్ బ్యూటీనో కాకుండా… ఏకంగా పాకిస్తానీ బ్యూటీని పట్టేశారు. ఎస్ ! హను రాఘవపూడి డైరెక్షన్లో తను చేస్తున్న పాన్ వరల్డ్ మూవీ ఫౌజీలో.. పాకిస్తానీ బ్యూటీ సజల్ అలీతో మన ప్రభాస్ పెయిరప్ అవుతున్నారట. డైరెక్టర్ ఛాయిస్ మేరకు.. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఈ బ్యూటీని ఫైనల్ కూడా చేశారని ఇండస్ట్రీలో ఓ టాక్.
08.sonu: ఎంగిలి చేసిన చపాతీలు.. తింటే ఏంటి.? సోనూ సూద్ షాకింగ్ రియాక్షన్
నిన్న మొన్నటి వరకు సేవా కార్యక్రమాలతో నెట్టింట వైరల్ అయిన సోనూ సూద్ ఇప్పుడు ట్రోల్ అవుతున్నారు. తాను చేసిన ఓ ట్వీట్ కారణంగా..! ఆ ట్వీట్లో శబరి ఎంగిలి తిన్న రాముడి సీన్‌ను మరోలా చెప్పడం మూలానా.. ! ఇప్పుడు ఓ వర్గం నెటిజన్స్‌కు ఆయన టార్గెట్ అయ్యారు. ఇక రీసెంట్గా తాండూరులో ఒక వ్యక్తి.. తన హోటల్లో రోటీ తయారు చేస్తూ దానిపై ఉమ్మి వేశాడు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. అయితే ఆ వీడియోను షేర్ చేసిన సోనూ సూద్.. ఆ వీడియోలోని వ్యక్తిని శబరి తో పోల్చాడు. శబరి రాముడు మిగిల్చిన పండును తింది.. హింసను ఓడించడానికి తాను ఈ సోదరుడు ఎంగిలి రోటీని ఎందుకు తినను…! అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అంతేకాదు మానవత్వం సర్వత్రా వ్యాపింపజేయాలని అన్నారు.
09.heroin jasmin: అందం కోసం ఆరాటపడితే.. చివరికి కళ్లే పోయాయి.!
నయనాలు అందంగా కనిపించాలని ఆరాటపడిన బాలీవుడ్ బ్యూటీ నేహా బాసిన్‌కు బిగ్ ఝలక్ తగిలింది. కాంటాక్ట్ లెన్స్‌తో.. అందంగా కనిపించొచ్చు అనుకుంటే.. ఏకంగా ఆమె కళ్లు పోయే పరిస్థితి వచ్చింది. అందం కోసం.. అతిగా లెన్స్ వాడే అలవాటు ఉన్న ఈమెకు.. ఆ లెన్స్ కారణంగా కార్నియా దెబ్బతింది. చూపు కోల్పోయింది. దీంతో ఈమెను పరీక్షించిన వైద్యులు.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఆమె చూపుని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.