TOP9 ET: కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?

TOP9 ET: కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?

Anil kumar poka

|

Updated on: Jun 18, 2024 | 10:27 AM

జూన్ 27న వరల్డ్ వైడ్ ప్రభాస్‌ మోస్ట్ అవేటెడ్ మూవీ కల్కి రిలీజ్ అవుతున్న వేళ.. ఈ మూవీ మేకర్స్‌ మెగా ప్రీ రిలీప్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారట. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.. టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ మెగా స్టార్ చిరు ఈ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌లుగా వచ్చేయనున్నారట. ఇక ఈవెంట్‌ కూడా ఏపీ రాజధాని అమారావతిలోనే జరగనుందట. అయితే ఇదేమీ అఫీషియల్ న్యూస్ కానప్పటికీ.. ఇండస్ట్రీలో వినిపిస్తోంది చాలా స్ట్రాంగ్‌గా..!

01.kalki: కల్కి మెగా ఈవెంట్‌

జూన్ 27న వరల్డ్ వైడ్ ప్రభాస్‌ మోస్ట్ అవేటెడ్ మూవీ కల్కి రిలీజ్ అవుతున్న వేళ.. ఈ మూవీ మేకర్స్‌ మెగా ప్రీ రిలీప్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారట. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.. టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ మెగా స్టార్ చిరు ఈ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌లుగా వచ్చేయనున్నారట. ఇక ఈవెంట్‌ కూడా ఏపీ రాజధాని అమారావతిలోనే జరగనుందట. అయితే ఇదేమీ అఫీషియల్ న్యూస్ కానప్పటికీ.. ఇండస్ట్రీలో వినిపిస్తోంది చాలా స్ట్రాంగ్‌గా..!

02.kalki: కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?

కల్కి సినిమాను నెక్ట్స్‌ లెవల్లో పిక్చరైజ్ చేయడమే కాదు.. తన సినిమాలో చాలా సర్‌ప్రైజెస్‌ను దాచిపెట్టారట ఈ మూవీ డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌. జూన్ 27న థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుడిని ఆ సర్‌ప్రైజెస్‌తోనే థ్రిల్ చేసే ప్లాన్ కూడా చేశారట. అయితే తన కల్కి సినిమాతో.. ఆన్ స్క్రీన్‌ పై నాగ్ అశ్విన్ ఇచ్చే ఈ సర్‌ప్రైజెస్‌లో మెగా స్టార్ చిరు కూడా ఒకరట. అందరూ షాకయ్యేలా.. మెగా అభిమానులు కాలర్ ఎగరేసేలా.. కల్కి మూవీలో మెగా పవర్ స్టార్ చిరు క్యాపియో ఇవ్వనున్నారట. చిరుతో పాటు.. బాలీవుడ్ కింగ్ ఖాన్‌ షారుఖ్ కూడా.. ఈ మూవీలో కనిపించనున్నారట. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే జూన్ 27 వరకు ఆగాల్సిందే.

03.power: పవర్ స్టార్ ఎంట్రీ.. పోలీసుల సెల్యూట్‌.. గూస్‌ బంప్ వీడియో.

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ట్రెండ్ అవడమే కాదు.. మెగా పవర్ ఫ్యాన్స్‌తో పాటే చేసిన వారికి గూస్ బంప్ తెప్పిస్తోంది. ఇక ఈ వీడియోలో.. వైట్ కలర్ టయోటా లాంగ్ క్రూజర్‌లో పవన్‌ కళ్యాణ్ దిగగానే.. జనసేనానికి పోలీసులు సెల్యూట్‌ చేసినట్టుగా ఆ వీడియోలో కనిపించడం.. ఇప్పుడు జనసైనికులకు.. పవన్‌ ఫ్యాన్స్‌కు కిక్కిస్తోంది. ట్విట్టర్లో ఎక్కడ చూసినా ఈ వీడియోనే కనిపిస్తోంది.

04.kriti: ఇక కష్టమే.. దారుణంగా హీరోయిన్ సిట్యూవేషన్

పాపం ! కృతి షెట్టి పరిస్థితి మనమే సినిమాతో మరీ దారుణంగా మారింది. ఉప్పెన దిమ్మతిరిగే సక్సెస్‌తో.. వరుస పెట్టి సినిమాలు చేసిన కృతి.. అలా చేసిన సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కాకపోవడంతో.. టాలీవుడ్‌లో సైలెంట్ అయిపోయింది. ఆఫర్స్‌ లేక సిల్వర్ స్క్రీన్‌ కు దూరంగా ఉంటోంది. ఇక ఈ క్రమంలోనే వచ్చిన మనమే సినిమాతో అయినా.. తన ఫేట్ మారుతుంది అనుకుంటే..ఆ సినిమా కూడా.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో టాలీవుడ్ లో ఈ బ్యూటీ సిట్యూవేషన్ దారుణంగా ఉందని.. తెలుగులో ఆల్మోస్ట్ కెరీర్ ఖతమైనట్టే అనే కామెంట్ నెట్టింట వస్తోంది.

05.allu arjun: అల్లు అర్జున్‌కు మరో షాక్‌

ఓ పక్క పుష్ప2 సినిమాను కొనేందుకు నైజాంలో బయర్స్‌ ఎవరూ ముందుకు రావడం లేదనే టాక్. ఇంకో పక్క పుష్ప2 రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందనే న్యూస్… వెరసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. అట్లీ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ చేయబోయే నెక్ట్స్‌ సినిమా ఆగిపోయినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అట్లీ చెప్పిన స్టోరీ లైన్ బానే ఉన్నప్పటికీ.. రీసెంట్‌గా ఈ స్టార్ డైరెక్టర్ చెప్పిన పూర్తి కథ నచ్చకపోవడంతో.. అల్లు అర్జున్ కాస్త సైలెంట్ అయిపోయారట. దీంతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ను అప్రోచ్ అయిన అట్లీ.. మరో కథను ఆయనకు చెప్పి ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడట. వెంటనే ఆ సినిమా మొదలు పెట్టనున్నాడట.

06.darshan: దారుణంగా చంపారు.! పోస్ట్‌ మార్టమ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.

రేణుకస్వామి హత్య కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఇన్నాళ్లు సూపర్ స్టార్‏గా ప్రేక్షకుల ప్రేమను అందుకున్న హీరో దర్శన్.. ప్రియురాలి కోసం రాక్షసుడిలా మారాడని అందరూ విమర్శిస్తున్న వేళ.. బయటికి వచ్చిన పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ సంచలనంగా మారింది. రేణుకస్వామి తల, పొట్ట, ఛాతీ, ఇతర భాగాలపై అనేక బలమైన గాయాలున్నాయని రిపోర్టులో వెల్లడైంది. అలాగే అతడి తలను బలంగా వాహనానికి కొట్టారని.. దాంతో షాక్ కు గురికావడం.. తీవ్ర రక్తస్రావం కారణంగానే అతడు మృతి చెందినట్లు నివేదికలో తేలింది. అలాగే అతడి కాళ్లు, చేతులు, వీపు, ఛాతీలో రక్తస్రావం అయిందని.. గాయాలు బలంగా తగలడంతో రక్తం గడ్డకట్టడంతో అతడు ప్రాణాలు విడిచాడని తేలింది. చెక్క కర్ర, బెల్టుతో అతడిపై పాశవికంగా దాడి చేసినట్టు నిర్దారణ అయింది.

07.darshan: కేసు నుంచి తప్పించుకోడానికి 30 లక్షల డీల్.. అడ్డంగా దొరికిపోయిన హీరో.

ఇక రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ పేరు బయటకు రాకుండా పెద్ద డీలే కుదిరిందట. నేరాన్ని తమపై వేసుకుని, హీరోని కేసు నుంచి కాపాడితే 30 లక్షలిస్తానన్నది దర్శన్ చేసుకున్న ఒప్పందమట. ఆవిధంగా చేతులు మారిన 30 లక్షల నగదును కూడా రీసెంట్‌గా సీజ్‌ చేశారు పోలీసులు. దర్శన్‌కు బాగా సన్నిహితుడైన ఒకరి ఇంటిమీద దాడి చేసి.. ఈ 30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అటు.. మృతుడు రేణుకాస్వామికి సంబంధించి కూడా ఆసక్తికరమైన విషయాలు బైటికొస్తున్నాయి. అవకాశం దొరికినా తప్పించుకోకుండా.. అనవసరంగా హీరో చేతికి చిక్కి.. మృత్యువాత పడ్డాడట రేణుకాస్వామి.

08. pawan kalyan: గుడ్ న్యూస్.. హరి హర సెట్స్‌లోకి పవన్‌

జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎంగా.. దాదాపు 6 శాఖలకు మంత్రిగా మారిపోయారు. తొందర్లో సెక్రటేరియట్‌ నుంచి తన పాలనను మొదలుపెట్టనున్నారు. ఇక ఈ క్రమంలోనే పవన్‌ ఫ్యాన్స్‌ కోసం ఓ దిమ్మతిరిగే న్యూస్ బయటికి వచ్చింది. తొందర్లో పవన్‌ హరి హర వీర మల్లు సెట్స్‌లో అడుగెపెట్టనున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రియారిటీ ప్రకారం మొదట హరి హర వీరమల్లు సినిమా ఫినిష్ చేశాక.. నెక్ట్స్‌ ఓజీని కూడా ఫినిష్ చేయనున్నారట పవన్.

09.vijay sethupathi: విజయ్ సేతుపతి కాళ్లు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.

ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా.. విజయ్‌ సేతుపతి కాళ్లు మొక్కిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు సేతుపతి హైద్రాబాద్ రాగా.. అదే ఈవెంట్‌కు వెళ్లిన బుచ్చిబాబు.. సేతుపతిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి కాళ్లు మొక్కడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక రీసెంట్‌ గా మహరాజ సినిమాతో మంచి హిట్ అందుకున్న విజయ్‌ సేతుపతి.. ఈ మూవీ ప్రమోషన్లో ఇంటర్వ్యూల్లో బుచ్చిబాబు వల్లే తాను ఉప్పెన సినిమాలో విలన్ గా చేశానంటూ చెప్పారు. ఆ మాటలతో కొన్ని రోజులు నెట్టింట ట్రెండ్ అయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.