TOP9 ET: తగ్గేదే లే! రూ.1000 కోట్ల పుష్పరాజ్‌| రూ.125 కోట్లు.. టిల్లుగాడి కలెక్షన్స్‌.

|

Apr 17, 2024 | 7:50 PM

ఆఫ్టర్ బాహుబలి 2 టాలీవుడ్ స్టార్ హీరోస్‌ వెయ్యి కోట్ల మార్క్‌ పై కన్నేశారు. వెయ్యి కోట్లు కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. అది అందుకొనేందుకు పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తూ.. వస్తున్నారు. ఇక ఈక్రమంలోనే పుష్ప కు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప2 మూవీ కూడా వెయ్యి కోట్లు మార్క్‌నే ఎయిమ్ చేసింది.

01. allu arjun: తగ్గేదే లే! 1000 కోట్ల పుష్పరాజ్‌.

ఆఫ్టర్ బాహుబలి 2 టాలీవుడ్ స్టార్ హీరోస్‌ వెయ్యి కోట్ల మార్క్‌ పై కన్నేశారు. వెయ్యి కోట్లు కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. అది అందుకొనేందుకు పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తూ.. వస్తున్నారు. ఇక ఈక్రమంలోనే పుష్ప కు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప2 మూవీ కూడా వెయ్యి కోట్లు మార్క్‌నే ఎయిమ్ చేసింది. సుక్కు విజయ్‌ బన్నీ ఊర మాస్‌ యాక్షన్‌కు ఈ రేంజ్‌ వసూళ్లు పక్కా అనే టాక్ కూడా ఫిల్మ్ ఫెటర్నిటీలో వినిపిస్తోంది.

02. dj tillu: 125 కోట్లు.. దిమ్మతిరిగే రేంజ్‌లో టిల్లుగాడి కలెక్షన్స్‌

నాలుగు గళ్లిళ్లు కాదు.. నలుమూలలా ఇప్పుడు టిల్లు గాడి డీజే సౌండే వినిపిస్తోంది. దిమ్మతిరిగే కలెక్షన్స్‌ రావడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే 100 కోట్ల కమాయించి అందర్నీ షాకయ్యేలా చేసిన టిల్లు స్క్వేర్ మూవీ.. తాజాగా125 కోట్లు వసూలు చేసింది. స్టిల్ కాంన్‌స్టాంట్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఇక ఇదే విషయాన్ని చెబుతూ మేకర్స్ 125 కోట్ల పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

03.devara: 130 కోట్లు అప్పుడే ఖాతా ఓపెన్ చేసిన దేవర.

దేవర ఖాతా ఓపెన్ చేశాడు. రిలీజ్‌కు ముందే బిజినెస్ మొదలెట్టేశాడు. ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ రిపోర్ట్‌.. ది మోస్ట్ అవేటెడ్ మూవీగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న దేవర మూవీ థియేట్రికల్ రైట్స్ .. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 130 కోట్లను మేకర్స్ కోట్ చేశారట.

04.vijay: యూట్యూబ్‌ చరిత్రలోన.. దిమ్మతిరిగే రికార్డ్‌ !

విజయ్‌ దళపతి రికార్డులు రారాజుగా కంటిన్యూ అవుతున్నారు. ఇక ఈసెంట్ గా విజయ్‌ అప్‌ కమింగ్ సినిమా ది గోట్ నుంచి విజిల్ పోడు లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఇక రిలీజైన 24 గంటల్లోనే ఈ సాంగ్ 24.88 మిలియన్ వ్యూస్‌ను యూట్యూబ్‌లో వచ్చేలా చేసుకుంది. సౌత్ ఇండియాలోనే 24 గంటల్లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న లిరికల్ సాంగ్‌గా ఎవర్ గ్రీన్ హిస్టరీ క్రియేట్ చేసింది.

05.saipallavi: కాలేజ్‌లో డ్యాన్స్‌ ఇరగదీసిన సాయి పల్లవి.!

ఇప్పుడంటే.. కాస్త క్లాసీగా.. నాచురల్ గా కనిపించే హీరోయినే కానీ.. అప్పట్లో మాత్రం ఊరమాస్‌ డ్యాన్సర్ మన సాయి పల్లవి. డ్యాన్సర్ గా కెరీర్‌ మొదలు పెట్టి.. రేపో మాపో పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా చేసే ఈ బ్యూటీ.. కాలేజీ వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఇక ఆ వీడియోలో ఊర మాస్‌ డ్యాన్స్‌ చేసి అందర్నీ ఆకట్టుకుంటోంది. తను కాలేజ్‌లో చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో అందర్నీ చప్పట్లు కొట్టేలా చేసుకుంటోంది.

06.balayya: ప్రచార వాహనం మీదికి దూకి.. మైకు పైకి ఎగరవేసి..

మాటలే కాదు.. చేతలతో కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ అయ్యే బాలయ్య.. రీసెంట్‌ తన పొలిటికల్ మీటింగ్‌లో అలాంటి చేతలే చేస్తున్నారు. తనను చూసేందుకు తన మాటలు వినేందుకు కుప్పలు తెప్పలుగా వచ్చిన తన ఫ్యాన్స్‌ను.. తన చేతలతో .. అరిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం తన స్టైల్లో మైకు పైకి ఎగరేసి క్యాచ్ పడుతున్నారు. ఇక రీసెంట్‌గా నందికొట్కూరులో జరిగిన మీటింగ్‌లో అయితే ఏకంగా ప్రచార వాహనం మీదికి దూకారు. తన చర్యలతో అటు ఫ్యాన్స్‌ను అరిపిస్తూనే.. ఇటు నెట్టింట వైరల్ అవుతున్నారు.

07.geethanjali: మెట్రో ఎక్కిన సినిమా ప్రచారం

తమ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేయడానికి అష్ట కష్టాలు పడుతున్నారు నేటి మేకర్స్. కొత్తగా ఆలోచిస్తూ.. నెట్టింట వైరల్ అవుతూ ఎలాగోలా.. తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక తాజాగా గీతాంజలి మళ్లీ వచ్చింది మేకర్స్ కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారు. ఈ సినిమా ప్రొడ్యూస్ కోన వెంకట్ ఈ సినిమాలో యాక్ట్‌ చేసిన కొంతమంది స్టార్ ఆర్టిస్టులను తీసుకుని హైద్రాబాద్ మెట్రో స్టేషన్స్లో తమ సినిమాను ప్రమోట్ చేశారు. మెట్రో ట్రైన్‌లో కూడా.. తమ సినిమా చూడాలంటే ఆడియెన్స్‌కు చెప్పే ప్రయత్నం చేశారు.

08.shankar: శంకర్ కూతురి పెళ్లిలో మెగా వెలుగులు.

మెగా స్టార్ చిరు.. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌.. తమ టోటల్ ఫ్యామిలీతో కలిసి స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురి పెళ్లి వేడుకలో కనిపించారు. ఆ పెళ్లి వేడుకలో అట్రాక్షన్ గా నిలిచారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని ఆశీర్వదించారు. ఇక శంకర్ కూతురు ఐశ్యర్యకు తన అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయను ఇచ్చి చెన్నైలో గ్రాండ్గా పెళ్లి చేశారు శంకర్.

09.manjumal: తెలుగులో 10 కోట్లు.. బిగ్ హిట్ దిశగా మజుమ్మల్ బాయ్స్‌.

జెస్ట్ 20 కోట్లతో తెరకెక్కి… 236 కోట్లు వసూలు చేసి.. మళయాల ఫిల్మ్ హిస్టరీలోనే ఎవర్‌ గ్రీన్ హిట్ గా నిలిచిన సినిమా మంజుమ్మల్ బాయ్స్‌. ఇక రీసెంట్‌గా తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వెరీ సర్‌ప్రైజింగ్‌లీ 10 కోట్ల మార్క్‌కు రీచైంది. ఏ స్టార్ అండ్ ప్రమోషనల్ హడావిడి లేకపోయినా… ఈ సినిమా తెలుగు టూ స్టేట్స్‌లో 10 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఇదే న్యూస్ టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Published on: Apr 17, 2024 12:39 PM