TOP9 ET: 'పెద్ది' బయటికొచ్చిన RC16 టైటిల్‌ | ఉస్తాద్‌ను పక్కకు పెట్టిన పవన్‌.?

TOP9 ET: ‘పెద్ది’ బయటికొచ్చిన RC16 టైటిల్‌ | ఉస్తాద్‌ను పక్కకు పెట్టిన పవన్‌.?

Anil kumar poka

|

Updated on: Mar 16, 2024 | 10:38 AM

సినిమా పేరు షాట్ అండ్ స్వీట్‌గానే కాదు.. ఎఫెక్టివ్‌గానూ.. మాస్‌ టచ్‌తోనూ ఉండాలి. సినిమాలోని కంటెంట్‌ను కాస్తైనా మ్యాచ్‌ చేసేలా ఉండాలి. ఇవన్నీ చేస్తుంది కనుకే రామ్ చరణ్‌ RC16 టైటిల్‌ను 'పెద్ది' గా ఫిక్స్ చేశారట ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సనా..! ఇక మట్టి కథగా.. స్పోర్ట్స్‌ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది ఈ సినిమా. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ స్టార్ట్ అయిపోయింది. గేమ్ ఛేంజర్‌ షూటింగ్‌ ఫినిష్ అవగానే చెర్రీ గ్రాండ్ ఎంట్రీతో ఈ మూవీ షూట్ మొదలు కానుంది.

01.ramcharn: ‘పెద్ది’ బమటికొచ్చిన RC16 టైటిల్‌

సినిమా పేరు షాట్ అండ్ స్వీట్‌గానే కాదు.. ఎఫెక్టివ్‌గానూ.. మాస్‌ టచ్‌తోనూ ఉండాలి. సినిమాలోని కంటెంట్‌ను కాస్తైనా మ్యాచ్‌ చేసేలా ఉండాలి. ఇవన్నీ చేస్తుంది కనుకే రామ్ చరణ్‌ RC16 టైటిల్‌ను ‘పెద్ది’ గా ఫిక్స్ చేశారట ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సనా..! ఇక మట్టి కథగా.. స్పోర్ట్స్‌ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది ఈ సినిమా. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ స్టార్ట్ అయిపోయింది. గేమ్ ఛేంజర్‌ షూటింగ్‌ ఫినిష్ అవగానే చెర్రీ గ్రాండ్ ఎంట్రీతో ఈ మూవీ షూట్ మొదలు కానుంది.

02.pawan: ఉస్తాద్‌ను పక్కకు పెట్టిన పవన్‌?

పవన్‌ పొలిటికల్ ఫీల్డ్‌లో బిజీగా ఉన్నారు. తన కోసం వెయిట్ చేయకుండా.. మీ పని మీరు చేసుకోండి అంటూ ముందే డైరెక్టర్లకు చెప్పారు. అందుకే అన్నట్టు హీరీష్‌ శంకర్, క్రిష్‌లు కూడా తమ తమ సినిమాలను మొదలెట్టారు. కానీ ఈ మధ్యలో నే హరీష్ శంకర్ చెప్పిన ఓ విషయం అందర్లో కొత్త డౌట్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఉస్తాద్ జస్ట్ 5 రోజులే షూటింగ్ జరిగిందంటూ.. ఆయన నుంచి వచ్చిన మాట.. ఇప్పుడు ఈసినిమా ఇక ముందుకు కదలడం కష్టమే అనే కామెంట్ వచ్చేలా చేస్తోంది. దాంతో పాటే.. పవన్‌ ఓజీ తో పాటు హరిహర కంప్లీట్ చేసి.. ఉస్తాద్‌ పక్కకు పెట్టేసే అవకాశం ఎక్కువనే ఓపీనియన్‌ నెట్టింట కామెంట్స్ గా వస్తోంది.

03. ramcharan: చరణ్‌ ధాటికి అర్థరాత్రి ఊగిపోయిన వైజాగ్ ఎయిర్‌ పోర్ట్‌

నిన్న కాక మొన్నే బన్నీ ధాటికి వైజాగ్ మొత్తం ఊగిపోయింది. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కారణంగా.. సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. శంకర్ డైరెక్షన్లో తాను చేస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్‌ వైజాగ్‌లో జరనుంది. దీంతో అర్థరాత్రి తన చార్టెడ్ ఫ్లైట్‌లో వైజాగ్‌ ల్యాండ్‌ అయ్యారు చెర్రీ. ఇక చెర్రీని చూసేందుకు మెగా అభిమానులందరూ భారీనీ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. మెగా పవర్ స్టార్ దిమ్మతిరిగే రేంజ్‌లో వెల్‌ కమ్‌ చెప్పడమే కాదు.. తమ అరుపులతో వైజాగ్‌ ఎయిర్ పోర్ట్‌ను ఊగిపోయేలా చేశారు.

04. amala: నిండు గర్భంతో.. పబ్‌లో తాగి తందనాలు ఆడిన హీరోయిన్

గర్భంతో ఉంటే ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు. పండ్లు..పౌష్టికాహారం తింటూ పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తుంటారు. కానీ హీరోయిన్ అమాలాపాల్ మాత్రం.. దీనికి క్వైట్ ఆపోజిట్గా చేస్తున్నారు. ఓ పక్క పృథ్వీ రాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ సినిమాను ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూనే.. మరో పక్క పబ్బులో ఎంజాయ్ చేస్తున్నారు. లిక్కర్ తాగుడూ.. తన కడుపు పట్టుకుని మరీ డ్యాన్స్ చేస్తున్నారు. తన క్రేజీ పనులతో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు.

05. ormax: ప్రభాస్‌ నెంబర్ 1 స్టార్..! 10 స్థానంలో చిరు!

నాన్ సింక్ అయినా… “ఎవడ్రా మనల్నాపేదీ!” అనే డైలాగ్‌తో.. ఎదురే లేకుండా దూసుకుపోతున్నారు మన డార్గింగ్ ఫ్రభాస్. ఓ పక్క నేషనల్ గా నెంబర్ 1 పాన్ ఇండియన్ స్టార్‌గా బజ్ చేస్తూనే… మరో పక్క తెలుగు టూ స్టేట్స్‌లోనూ తన తడాఖా చూపిస్తున్నారు. టాలీవుడ్ నెంబర్ 1 హీరో తనే అనే టాక్ వచ్చేలా చేసుకుంటున్నారు. తాజాగా ఓర్ మాక్స్ మోస్ట్ లవ్‌డ్ తెలుగు మేల్ స్టార్స్‌ ఎవరంటూ చేసిన సర్వేలో.. ఆల్ ఇండియాలోనే నెంబర్ 1 ర్యాంకు వచ్చేలా చేసుకున్నారు మన డార్లింగ్ ప్రభాస్. ఇక తరువాత స్థానంలో మహేష్ ఉండగా.. లాస్ట్ 10 త్‌ ప్లేస్‌లో చిరు ఉన్నారు.

06.manoj: హీరో మనోజ్ భార్యకు సీమంతం

ఇటీవల భూమా మౌనికను పెళ్లి చేసుకుని సక్సెస్‌ ఫుల్‌గా మ్యారీడ్‌ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మనోజ్‌. తొందర్లో తండ్రిగా ప్రమోషన్‌ కూడా పొందనున్నారు. తన భార్య భూమా మౌనిక తన చేతిలో పండండి బిడ్డను ఎప్పుడెప్పుడు పెట్టనుందాని ఎదురుచూస్తున్నారు. ఇక ఈకమ్రంలోనే తన భార్యకు గ్రాండ్‌గా సీమంతం జరిగింది. మనోజ్ అండ్ మౌనిక్‌ బంధు మిత్రల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు నంద్యాల వేదికైంది. ఇక ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

07.allu arjun: మళ్లీ పూజనే నమ్ముకున్న ఐకాన్ స్టార్

నిన్న మొన్నటి వరకు గురూజీకి లక్కీ గార్ల్‌గా ఉన్న పూజా హెగ్డే.. ఇప్పుడు బన్నీ లక్కీ గార్ల్‌గా మారిపోయారా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్స్. అనడమే కాదు ఎప్పుడూ పెద్దగా హీరోయిన్లను రిపీట్‌ చేయని ఐకాన్ స్టార్.. అల వైకుంఠ పురం హీరోయిన్‌తో తన అప్‌ కమింగ్ ఫిల్మ్లోకి తీసుకున్నారట. అట్లీ డైరెక్షన్లో తాను చేయబోయే బిగ్ పాన్ ఇండియన్ సినిమాలో పూజా బేబీకి బెర్త్‌ కన్ఫర్మ్ చేశారట బన్నీ.

08.devara: దేవర ఫస్ట్ సాంగ్‌ వచ్చేస్తుందోచ్‌…

ఇప్పటికే దేవర కౌంట్ డౌన్ షురూ అయిపోయింది. అందుకు తగ్గట్టే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈక్రమంలోనే ఈమూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదే దేవర నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందని! ఎస్! అకార్డింగ్‌ టూ ఫిల్మ్ రిపోర్ట్‌ దేవర నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్.

09. vishwak: నేను విమర్శించలేదు.!

విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చారు. గామి సినిమాను కూడా నలుగురు పెద్దోళ్లు చూస్తే బాగుంటుందంటూ.. రీసెంట్‌గా ఈ స్టార్ చేసిన కామెంట్స్.. జనాల్లోకి తప్పుగా వెళ్లడంతో.. తాజాగా వివరణ ఇచ్చారు. రిలీజ్‌కు ముందు సపోర్ట్‌ చేయమని అడిగితే.. అది లేపమని సపోర్ట్‌ చేయమని..! అదే సినిమా హిట్ అయ్యాక అడిగితే తమను గుర్తించయని అర్థం! ఇదే తాను చెప్పాలనుకుంది అంతే ! అంటూ ఓ నోట్ ను రిలీజ్ చేశారు. అంతే కానీ.. అందరూ అనుకుంటున్న కాదంటూ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..