TOP9 ET: దేవర ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. | RRR రికార్డులు బద్దలు కొట్టిన కల్కి.

దేవర సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! ఈ సినిమా రిలీజ్‌ డేట్ ప్రీ పోన్ అయింది. దేవర సినిమాను ముందుగా అనుకుంటున్నట్టు అక్టోబర్ 10కి కాకుండా.. సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ నుంచి అఫీషియల్‌ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇది కాస్తా యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్‌గా మారింది. అంతేకాదు 'ఎంత తొందర వీలైతే అంత తొందర్లో మీ ముందుకు వస్తా అంటూ గతంలో తారక్‌ చెప్పిన మాట.. చెప్పినట్టే నిజమైంది.

TOP9 ET: దేవర ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. | RRR రికార్డులు బద్దలు కొట్టిన కల్కి.

|

Updated on: Jun 14, 2024 | 9:35 AM

01. devara : దేవర ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పినట్టే చేసిన NTR

దేవర సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! ఈ సినిమా రిలీజ్‌ డేట్ ప్రీ పోన్ అయింది. దేవర సినిమాను ముందుగా అనుకుంటున్నట్టు అక్టోబర్ 10కి కాకుండా.. సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ నుంచి అఫీషియల్‌ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇది కాస్తా యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్‌గా మారింది. అంతేకాదు ‘ఎంత తొందర వీలైతే అంత తొందర్లో మీ ముందుకు వస్తా అంటూ గతంలో తారక్‌ చెప్పిన మాట.. చెప్పినట్టే నిజమైంది.

02. kalki: RRR రికార్డులు బద్దలు కొట్టిన కల్కి

జస్ట్ రిలీజ్‌కు ముందు ప్రభాస్ కల్కి మూవీ ట్రిపుల్ ఆర్ రికార్డులను బద్దలు కొట్టింది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌ విషయంలో ట్రిపుల్ ఆర్ క్రియేట్ చేసిన అన్‌ బ్రేకబుల్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. జూన్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్‌కు రెడీ అయిన ఈ మూవీ.. రిలీజ్‌కు రెండు వారాల ముందే.. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌లో 1 మిలియన్ టికెట్స్‌ సేల్ అవడం.. ఇప్పుడు నయా రికార్డ్‌గా నమోదైంది. అది కూడా ట్రిపుల్ ఆర్ కంటే వేగంగా.. 1 మిలియన్ ప్రీ సేల్ టికెట్స్ సేల్ అవ్వడం.. అందర్నీ సర్‌ ప్రైజ్‌ చేస్తోంది.

03.kalki: చిక్కుల్లో కల్కి టీం..

ఓ పక్క అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూ.. క్రేజీ మూవీగా దూసుకుపోతున్న కల్కి మూవీ చిక్కుల్లో పడింది. హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంగ్‌ చోయ్‌ ఈ సినిమా ట్రైలర్‌లోని ఓ సీన్‌ తన స్కెచ్‌ను పోలి ఉందని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక దీని గురించి తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసిన సంగ్‌ చోయ్‌.. తాను 10 ఏళ్ల క్రితం క్రియేట్ చేసిన ఆర్ట్‌ కాన్సెప్ట్‌.. రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి ట్రైలర్‌లోకి ఓపెనింగ్ షాట్‌ తో మ్యాచ్ అవుతుందని.. తన పోస్ట్ లో ఆరోపించారు. స్క్రీన్‌ షార్ట్స్‌ను కూడా షేర్ చేశారు. మరి దీని పై కల్కి మూవీ టీం ఎలా రియాక్టవుతారో చూడాలి.

04.rashmika: మగాళ్ల బిహేవియర్ గురించి రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్

అటు పాన్ ఇండియా సినిమాలతోనూ.. ఇటు సోషల్ మీడియాలో తన ఫోటోస్‌ను పోస్ట్‌ చేయడంతోనూ ఎప్పుడూ బిజీగా ఉండే రష్మిక మందన.. తాజాగా మగాళ్ల గురించి వాళ్ల బిహేవియర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. యానిమల్ సినిమాలోని ఓ సీన్‌ను పోస్ట్ చేసిన ఓ నెటిజన్‌ మగాడిని నమ్మడం కంటే భయంకరమైనది మరోటి లేదంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ఇక ఆ నెటిజన్‌ చేసిన పోస్ట్‌కు రియాక్టైన రష్మిక.. స్టుపిడ్ మ్యాన్‌ని నమ్మడం భయానకమని.. కానీ మగాళ్లలో చాలా మంది మంచి వ్యక్తులు కూడా ఉన్నారంటూ.. ఓ పోస్ట్ పెట్టారు. తన పోస్ట్ తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.

05. chiru: నెట్టింట వైరల్ అవుతున్న మోదీతో మెగా ఫ్యామిలీ గ్రూప్‌ ఫోటో

బాబు, పవన్ ప్రమాణ స్వీకార వేదికపై మోదీ చిరు, పవన్ చేతులు పైకెత్తి జనాలకు అభివాదం చేయడమే ఇప్పటి వరకు నెట్టింట వైరల్ అవుతూ వస్తోంది. ఇక దీనికి తోడు.. ఇప్పుడు మోదీ మెగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఆఫ్టర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం.. స్టేజ్‌ మీది నుంచి కిందకి దిగిన మోదీ.. వేదిక దగ్గరే వెయిట్ చేస్తున్న మెగా ఫ్యామిలీలోని సభ్యులందర్నీ కలిశారు. వారితో ఫోటోతో కలిసి ఓ గ్రూప్ ఫోటో దిగారు. ఇక ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు వారికి తెలియని కిక్కిస్తోంది.

06.darshan: తన వీరాభిమాని హత్యకే కుట్ర ఇదీ హీరో నిర్వాకం!

కన్నడ స్టార్ హీరో దర్శన్.. తను చేసిన పనితో.. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ పెటర్నిటీలోనే హాట్ టాపిక్ అవుతున్నాడు. తన ప్రియురాలి కోసం తన వీరాభిమాని రేణుస్వామినే హత్య చేయించాడనే ఆరోపణలను మూటగట్టుకున్నాడు. ఇక చిత్రదుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకా గౌడ మెడికల్‌ షాపు ఉద్యోగి.. దర్శన్‌ అంటే అతనికి ఎంతో అభిమానం. చాలా చాలా ఇష్టం. పవిత్ర వల్ల తన అభిమాన హీరో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఆవేదన చెందాడు. పవిత్ర గౌడకు అసభ్యరమైన మెసేజ్‌లు పంపి అనవసరంగా వివాదంలో చిక్కుకున్నాడు. చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

07.darshan: పెళ్లాంతో గొడవ.. ప్రియురాలితో సయ్యాట.. కట్ చేస్తే జైల్లో హీరో..

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరో.. డీ బాస్‌ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే హీరో.. అలాంటి ఈ హీరో తీరు ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది. సినిమాల్లో స్టార్ అయినా కూడా కట్టుకున్న పెళ్లాంతో ఎప్పుడూ గొడవ.. మరో పక్క ప్రియురాలు పవిత్ర గౌడతో సహజీవ చర్య.. వెరసి ఎప్పుడూ కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంటాడు ఈ హీరో. ఇక ఈ క్రమంలోనే తన ప్రియురాలు పవిత్ర గౌడ్‌ను వేధించిన రేణు స్వామి హత్య కావడం.. ఆ హత్య కేసులో పోలీసులకు సాక్ష్యా ధారాలతో సహా ఈ స్టార్ హీరో పోలీసులు చిక్కారు. ముద్దాయిగా జైల్లో కూర్చున్నారు.

08.darshan: ఒక్క సిగరెట్ ప్లీజ్‌! పోలీసులను అడుకుంటున్న స్టార్ హీరో..

ఓ వ్యసనం స్టార్ హీరో డీ బాస్‌ దర్శన్‌ను దిగజారేలా చేసింది. ఒక్క సిగరెట్ ప్లీజ్‌ అంటూ పోలీసులను అడుకునేలా చేసింది. ఇక రేణు స్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ హీరో దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక ఈ స్టార్ హీరోకు పోలీసులు మర్యాదలు బానే చేస్తున్నా… తనకున్న వ్యసనం ఈ స్టార్‌ హీరోను కుదురుగా ఉండనివ్వడం లేదట. సిగరెట్ ప్లీజ్ అంటూ.. అక్కడున్న పోలీసులను అడుక్కునేలా చేస్తోందట.

09.chiru: వేదికపై మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పిన చిరు..

చంద్రబాబు, పవన్‌ ప్రమాణ స్వీకార మహోత్సవంలో.. వీరిద్దరి ప్రమాణ స్వీకారం ఒకెత్తయితే…చిరు కూర్చున్న దగ్గరికే మోదీ వచ్చి మాట్లాడడం ఇంకో ఎత్తు. ఇదే ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే హైలెట్‌గా నిలిచింది. దాంతో పాటే అసలు మోదీ చిరుతో ఏం మాట్లాడారనే క్యూరియాసిటీ కూడా అందరిలో నెలకొంది. అయితే ఆ క్యూరియాసిటీని కిల్ చేస్తూ.. తాజాగా మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పారు చిరు. ఎలక్షన్లలో విజయం సాధించిన తన తమ్ముడు పవన్‌ను స్వయంగా సత్కరించారు చిరు. అయితే ఈ వీడియోనే చూసిన నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారట. అన్నదమ్ముల ఆప్యాయత ప్రేమానురాగాలను చూసి ఎమోషనల్ అయ్యారట. అంతేకాదు కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి పవన్, చిరు మధ్య వున్న ప్రేమానుబంధాలు.. భారత సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించేలా ఉన్నాయని… అనుకున్నారట. ఇక ఇదే విషయాన్ని ప్రమాణ స్వీకార వేదికపై చిరుతో చెప్పి అప్రియేట్ చేశారట మోదీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
టాలీవుడ్ విలన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అంజలా జవేరి..
టాలీవుడ్ విలన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అంజలా జవేరి..
మీకూ అర్ధరాత్రిళ్లు హఠాత్తుగా కడుపు నొప్పి వస్తుందా?
మీకూ అర్ధరాత్రిళ్లు హఠాత్తుగా కడుపు నొప్పి వస్తుందా?
ట్రంప్‌ దాడి వెనుక రహస్యం ఏంటి? దుండగుడు దాగున్న ఆ బిల్డింగ్‌లోనే
ట్రంప్‌ దాడి వెనుక రహస్యం ఏంటి? దుండగుడు దాగున్న ఆ బిల్డింగ్‌లోనే
వివాదంలో హీరో రక్షిత్ శెట్టి.. పోలీస్ కేసు నమోదు.. అసలు ఏమైందంటే?
వివాదంలో హీరో రక్షిత్ శెట్టి.. పోలీస్ కేసు నమోదు.. అసలు ఏమైందంటే?
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
రైల్వే బ్రిడ్జిపై దంపతుల రీల్స్.. అంతలో రైలు ఎంట్రీ!
రైల్వే బ్రిడ్జిపై దంపతుల రీల్స్.. అంతలో రైలు ఎంట్రీ!
పోస్ట్ మాస్టర్‌గా టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
పోస్ట్ మాస్టర్‌గా టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
అత్తగారికి ఎదురుతిరిగిన కళావతి.. రౌడీ బేబీ అరెస్ట్!
అత్తగారికి ఎదురుతిరిగిన కళావతి.. రౌడీ బేబీ అరెస్ట్!
ఏంటీ..! ఈ స్టార్ హీరోయిన్‌‌ను పరిచయం చేసింది ఈయన..!!
ఏంటీ..! ఈ స్టార్ హీరోయిన్‌‌ను పరిచయం చేసింది ఈయన..!!
'బైడెన్‌.. మళ్లీ మళ్లీ తడబడుచుండేన్‌'తలలు పట్టుకున్న డెమోక్రాట్లు
'బైడెన్‌.. మళ్లీ మళ్లీ తడబడుచుండేన్‌'తలలు పట్టుకున్న డెమోక్రాట్లు
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
ఏరా.! మీరు మారరా.? ఇతడు ఏం చేశాడో తెలిస్తే
ఏరా.! మీరు మారరా.? ఇతడు ఏం చేశాడో తెలిస్తే
ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?
ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?
దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.
EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.
3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.
3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.
అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.
అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..