TOP 9 ET: రూ.922కోట్ల కలెక్షన్స్ ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్ | మోహన్ బాబు ఇంటి గుట్టు..
పుష్పరాజ్ కొత్త చరిత్రకు తెరతీశాడు. తొలి 4 రోజుల్లోనే 800 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్‌లను చెరిపేసింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2.. ఐదో రోజు కూడా అదే దూకుడు చూపించింది. వర్కింగ్ డే రోజు కూడా నేషనల్ వైడ్‌గా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ.. ఎట్ ప్రజెంట్ 922 కోట్లను కొల్లగొట్టింది ఈ సినిమా. ఇక ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ఈ మూవీ టీం స్పెషల్ థాంక్స్ అంటూ ట్వీట్ చేసింది.
01.Pushpa 2: రూ.922 కోట్ల కలెక్షన్స్.. ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్.
పుష్పరాజ్ కొత్త చరిత్రకు తెరతీశాడు. తొలి 4 రోజుల్లోనే 800 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్‌లను చెరిపేసింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2.. ఐదో రోజు కూడా అదే దూకుడు చూపించింది. వర్కింగ్ డే రోజు కూడా నేషనల్ వైడ్‌గా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ.. ఎట్ ప్రజెంట్ 922 కోట్లను కొల్లగొట్టింది ఈ సినిమా. ఇక ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ఈ మూవీ టీం స్పెషల్ థాంక్స్ అంటూ ట్వీట్ చేసింది.
02.OG: పవన్ లేకుండానే OG షూటింగ్..
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ లో దర్శకుడు సుజిత్ తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సుజిత్ సీరీయస్ వర్క్ మోడ్‌లో కనిపిస్తున్నారు. హీరో లేని పోర్షన్ ను తెరకెక్కిస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది.
03.mohan: అసలు మంచు ఇంట ఏం జరుగుతోంది!
పూటకో ట్విస్ట్..రోజుకో టర్న్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది..హౌస్ ఆఫ్ మంచు స్టోరీ. నిన్న పోటాపోటీ ఫిర్యాదులతో మొదలైన ఫైర్.. ఈ రోజు వైల్డ్ ఫైర్‌గా మారింది. గతంలో నాలుగు గోడలకే పరిమితమైన ఫ్యామిలీ వార్..ఇప్పుడు రచ్చకెక్కింది. అటు మోహన్ బాబు.. ఇటు మనోజ్ తగ్గేదే లేదంటూ పోటాపోటీ ఫిర్యాదులు, ఆరోపణలు చేసుకుంటుండడంతో.. అసలు మంచు ఇంట ఏం జరుగుతోందన్న చర్చ నెట్టింట వస్తోంది.
04.manchu: మోహన్ బాబు ఇంటి నుంచి మనోజ్ అవుట్.!
మంచు ఫ్యామిలీలో ఆదివారం మొదలైన హైడ్రామా..స్టిల్ కంటిన్యూ అవుతోంది. సోమవారం మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే.. దానికి పోటీగా 30 మంది బౌన్సర్లను దింపాడు మనోజ్. ఈ నేపథ్యంలో జల్‌పల్లిలోని మంచుటౌన్‌లో మంగళవారం ఉదయం.. మంచు విష్ణు-మనోజ్ బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది. మనోజ్ బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపేశారు విష్ణు బౌన్సర్లు. జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి దగ్గర ట్రక్‌లు ఉన్నాయి. వీటిలో మనోజ్ కుటుంబానికి సంబంధించిన సామాన్లను తరలిస్తారని తెలుస్తోంది. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో మోహన్‌బాబు ఇంటిదగ్గర పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది..
05.manchu manoj: ఆత్మగౌరవం కోసమే నా పోరాటం..
మరోవైపు తన ఇంటి వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు..మంచు మనోజ్. ఆస్తి కోసమో, డబ్బు కోసమో తాను పోరాటం చేయడం లేదని.. ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నానని చెప్పారు. పోలీసులను ప్రొటెక్షన్ అడిగితే..రివర్స్‌లో తన అనుచరులనే బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వన్‌సైడ్ తీసుకున్నారంటూ ఆరోపణలు చేశారు మనోజ్.
06.MANOJ TWEET: 2 రాష్ట్రాల సీఎంలకు మంచు మనోజ్ రిక్వెస్ట్..
ఇక ఈ మొత్తం వ్యవహారంపై ఎక్స్ వేదికగా పది అంశాలతో సుదీర్ఘ వివరణ ఇచ్చారు..మంచు మనోజ్. పలు కుటుంబ అంశాలను ప్రస్తావించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులను, తెలంగాణ డీజీపీని మనోజ్ తన పోస్ట్‌కు ట్యాగ్ చేశారు. ఈ విషయంలో చివరకు న్యాయమే గెలుస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన కుటుంబానికి పలు ప్రశ్నలను సంధించారు..మనోజ్.
07.Allu Arjun: మరో అవార్డ్ పక్కా..
పుష్ప 2 సినిమాలో బన్నీ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయ్యా అంటున్నారు బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతెల్లా. థియేటర్లో సినిమా చూస్తున్న వీడియోస్ ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన ఊర్వశీ, బన్నీకి మరో నేషనల్ అవార్డు రాబోతోంది అంటూ కామెంట్ చేశారు.
08.animal: యానిమల్‌కి పార్ట్ 3 కూడా ఉంది.! రణ్బీర్ బిగ్ అప్డేట్..
రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సినిమా యానిమల్. ఈ సినిమా సెకండ్ పార్టును 2027లో తెరకెక్కిస్తారు. ఆ తర్వాత ఈ చిత్రానికి మూడో పార్టు కూడా ఉంటుంది. నటుడిగా కొత్తదనాన్ని ప్రోత్సహించడానికే యానిమల్ సినిమాను యాక్సెప్ట్ చేసినట్టు తెలిపారు రణ్‌బీర్ కపూర్.
09.jagapathi: ప్రభాస్ పంపిన భోజనం చేసి కుంభకర్ణుడిలా పడుకున్నా..
బకాసురుడిలాగా తిన్నాను… కుంభకర్ణుడిలాగా పడుకుంటాను అని అన్నారు జగపతిబాబు. ఆయన షూటింగ్‌లో ఉండగా ప్రభాస్ భోజనం పంపించారు. ఎన్ని వెరైటీలు పంపారో చూపిస్తూ వీడియో తీసి పెట్టారు జగపతిబాబు. జై భీమవరం, జై ప్రభాస్ జై బాహుబలి అంటూ ఆయన చెప్పిన మాటలను వైరల్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
10.surya: ఇచ్చిన మాట కోసం కష్టపడుతున్న సూర్య
భారీ అంచనాల మధ్య విడుదలైన కంగువ సినిమాకు అనుకున్నంత ప్రేక్షకాదరణ రాలేదు. ఈ సినిమా వల్ల నష్టపోయిన జ్ఞానవేల్ రాజాకు మరో సినిమా చేస్తానని మాటిచ్చారట సూర్య. ప్రస్తుతం ఆర్.జె.బాలాజీ దర్శకత్వంలో సూర్య ఓ సినిమాను చేస్తున్నారు. దాని తర్వాత వాడివాసల్‌ని పూర్తి చేస్తారు. ఆ వెంటనే జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో సినిమా ఉంటుందన్నది టాక్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.