TOP9 ET: దేవర పాటల రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్యనా..!
ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. సీరియస్ యాక్షన్ చేసే బాలయ్య ఈసారి ఎక్స్‌స్ట్రీమ్ కామెడీ పండించేందుకు రెడీ అవుతున్నాడనే టాక్ బయటికి వచ్చింది. ఫహాద్ ఫాజిల్ లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా ఆవేశం రిమేక్‌లో.. బాలయ్య యాక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మిస్టర్ బచ్చన్ రిలీజ్ కారణంగా కాస్త బిజీగా ఉన్న హరీష్ శంకర్.. ఈ సినిమా రిలీజ్ తర్వాత.. బాలయ్య హీరోగా.. ఆవేశం రీమేక్‌ను స్టార్ చేయబోతున్నారని న్యూస్ వస్తోంది.
01. ntr: దేవర పాటల రచయితకు ఎన్టీఆర్ ఫ్యాన్ స్వీట్ వార్నింగ్.!
దేవరలో సెకండ్ సాంగ్ చుట్టమల్లె.. రిలీజ్ అయింది. రొమాంటిక్ ఫీల్‌నిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో ఇప్పటికే దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. అయితే ఈ సాంగ్ రిలీజ్‌కు కొన్ని గంటల ముందే .. ఈ సాంగ్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రికి ఓ ఎన్టీఆర్ ఫ్యాన్ నుంచి ట్విట్టర్ వేదికగా స్వీట్ వార్నింగ్ అందింది. ఈ సాంగ్‌కు చాలా హైప్ ఇస్తున్నారని.. అంచనాలకు తగ్గట్టు లేకపోతే అప్పుడు చెబుతాం అంటూ.. జోగయ్య శాస్త్రిని ఎయిమ్ చేస్తూ ఆ ఫ్యాన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. హైప్ కాదు నిజం. సాంగ్ రిలీజ్ అయ్యాక చెప్పు.. ఇక్కడే ఉంటా అంటూ.. ఆ ట్వీట్‌కు శాస్త్రి బదులివ్వడం. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
02.balayya: ఇదెక్కడి న్యూస్ అయ్యా..? ఆవేశం రీమేక్‌లో బాలయ్యనా..!
ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. సీరియస్ యాక్షన్ చేసే బాలయ్య ఈసారి ఎక్స్‌స్ట్రీమ్ కామెడీ పండించేందుకు రెడీ అవుతున్నాడనే టాక్ బయటికి వచ్చింది. ఫహాద్ ఫాజిల్ లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా ఆవేశం రిమేక్‌లో.. బాలయ్య యాక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మిస్టర్ బచ్చన్ రిలీజ్ కారణంగా కాస్త బిజీగా ఉన్న హరీష్ శంకర్.. ఈ సినిమా రిలీజ్ తర్వాత.. బాలయ్య హీరోగా.. ఆవేశం రీమేక్‌ను స్టార్ చేయబోతున్నారని న్యూస్ వస్తోంది.
03.aug 15 release: ఇద్దరు హీరోలు బరిలో ఉన్నా.. వెనకడుగు వేయని విక్రమ్.
స్పెషల్ డే.. అందులోనూ లాంగ్ వీకెండ్.. అందుకే అన్నట్టు ఆగస్ట్ 15న సినిమాలు రిలీజ్ అయ్యేందుకు పోటీ పడుతున్నాయి. పుష్ప2 పోస్ట్ పోన్ అవ్వడంతో.. ఆ పోటీలో సినిమాలు ఎక్కువవుతూ వచ్చాయి. టాలీవుడ్ టాప్ హీరోస్ మాస్ రాజా రవితేజ, ఇస్మార్ట్ స్టార్ రామ్ పోతినేని.. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలను ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తున్నారు. నిహారిక కొణిదల, బన్నీ వాసు.. తమ సినిమాలు కమిటీ కుర్రాళ్లు, ఆయ్ సినిమాలకు కూడా ఇదే డేట్ రోజు తీసుకొస్తున్నారు. తెలుగు టూ స్టేట్స్లోని థియేటర్లను ఇప్పటికే పంచేసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ పోటీలోకి చియాన్ విక్రమ్ తన తంగలాన్ సినిమాతో వచ్చిచేరారు. టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్లు బరిలో ఉన్నా.. తన దగ్గర కంటెంట్ ఉంది.. తగ్గేదే లే అంటూ.. ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. దానికి తోడు.. తనతో పాటు రిలీజ్ అవుతున్న సినిమాల టీమ్స్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాడు ఈ హీరో.
04. manchu vishnu: కన్నప్ప న్యూ పోస్టర్‌పై దారుణంగా ట్రోల్స్.
నో డౌట్ కన్నప్ప బిగ్ స్కేల్లో తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అవుతున్న సెలబ్రిటీల ఫోటోలను చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది. అందులోనూ ఒక్కో సెలబ్రిటీ.. ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు.. ఏ తెగలను రిప్రజెంట్ చేస్తున్నారు.. ఏ ఆయుధాలు వాడుతున్నారు.. అని పోస్టర్ డిజైన్‌లోనే కోట్ చేసిన డీటేయిల్స్‌తో..ఈ సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ పెరుగుతోంది. కానీ తాజాగా రిలీజ్ అయిన ముండడు క్యారెక్టర్ పోస్టర్ మాత్రం అందర్నీ డిస్సపాయింట్ చేసింది. దారుణంగా విమర్శల పాలవుతోంది. దేవరాజ్ గెటప్ బాలేదని.. కామెడీగా ఉందనే కామెంట్ వస్తోంది.
05. prabhas: ప్రభాస్‌కు హీరోయిన్‌గా త్రిష? దెబ్బకు షాకవుతున్న ఫ్యాన్స్..
బుజ్జిగాడు సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసిన ప్రభాస్, త్రిష.. దాదాపు 16 ఏళ్ల తర్వాత మరో సారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయనున్నట్టు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ మూవీలో.. త్రిష హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు టాలీవుడ్లో ఓ టాక్ రన్ అవుతోంది. అది కాస్త నెట్టింటకెక్కి ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకొచ్చేలా చేస్తోంది.
06. murari: రీరిలీజ్‌కు ముందే.. మురారి దిమ్మతిరిగే రికార్డ్.!
రీ రిలీజ్ సేల్స్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది మహేష్ బాబు మురారి. ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా ఒక్క రోజులో 40 వేలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. ఇది రీ రిలీజ్ ట్రెండ్ ఆల్ టైమ్ రికార్డ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
07. Pushpa 2: నో ఫేక్స్.. ఇట్స్ అఫీషియల్.
‘పుష్ప-2’ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. క్లైమాక్స్ ఎపిసోడ్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాను డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇందులో పుష్పరాజ్‌గా బన్నీ.. శ్రీవల్లిగా రష్మిక మందన్న నటిస్తున్నారు.
08.shekar: పాపం! ఇద్దరి మధ్యలో ముద్దపప్పు అయిన శేఖర్ బాషా.
సాటి మగాడినిక సాయం చేయాలనే సదుద్దేశంతో.. రాజ్ తరుణ్‌కు మద్దతుగా.. లావణ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతూ సీన్లోకి వచ్చిన శేఖర్ బాషా ఇప్పుడు ఆసుపత్రిలో.. గాయాలతో ఏడుస్తూ కనిపించాడు. లావణ్య తన మనుషులతో దాడి చేయించిందని.. ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మొరపెట్టుకున్నాడు. మరో సారి లావణ్యను తిట్టిపోశాడు. రాజ్ తరుణ్‌కు మద్దతుగా మాట్లాడితే.. అందరూ తనను తిడుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవడంతో.. సోషల్ మీడియాలోని ఓ వర్గం ఈ ఆర్జేని ఆడుకుంటోంది. ఇద్దరి మధ్యలో ముద్దపప్పు అయ్యాడని కామెంట్ చేస్తోంది. లేనిపోని విషయాల్లో వేలు పెడితే ఇలానే ఉంటంది చెబుతోంది.
09. prabhas Rajasaab: రాజా సాబ్ గురించి థమన్ దిమ్మతిరిగే లీక్.
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ది రాజాసాబ్ సినిమా అప్‌డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. ప్రభాస్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన తమన్, ‘జాన్ కమ్ సూన్’ అంటూ కామెంట్ చేశారు. దీంతో జనవరి నుంచి ది రాజాసాబ్ ప్రమోషన్ ప్రారంభమవుతుందని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.