పర్సెంటేజ్ పంచాయితీ కొలిక్కి వచ్చినట్లేనా
తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న వివాదం పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయి. ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి, రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. పర్సెంటేజ్ వ్యవస్థతో పాటు థియేటర్ల సౌకర్యాలు, టికెట్ ట్రాన్స్‌పరెన్సీ అంశాలపై కూడా చర్చ జరిగింది. ఈ కమిటీ నిర్ణయాలు థియేటర్ వ్యవస్థలో కీలక మార్పులకు దారి తీసే అవకాశముంది.
రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఇండస్ట్రీ సమస్యలు కొలిక్కి వచ్చినట్లేనా..? నిన్నమొన్న ప్రెస్ మీట్‌లు పెట్టి మరీ.. విమర్శలు చేసుకున్న ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య సయోధ్య కుదిరినట్లేనా..? అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు లాంటి పెద్దలు వచ్చాక ఇష్యూ క్లియర్ అయిపోయిందా..? ఛాంబర్‌లో ఏం జరిగింది..? పర్సెంటేజ్‌కు ఓకే అన్నారా.. చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా..! ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తుంది. ఫిలిం ఛాంబర్ ప్రతినిధుల సమక్షంలో 3 సెక్టర్ల ప్రముఖులతో మీటింగ్ జరిగింది. సింగిల్ స్క్రీన్ పర్సెంటేజ్ ఇష్యూ కాస్తా.. వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లిన ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఛాంబర్ సమాయత్తం అయింది. దీనికోసం ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఒక్కో సెక్టర్ నుంచి ఏడుగురు ఉండేలా.. ఓ కమిటీ వేసారు. దీనికోసం 2 నెలల డెడ్ లైన్ పెట్టారు. రాబోయే 60 రోజుల్లో ఈ కమిటీ ఇచ్చే నివేదిక తెలుగు రాష్ట్రాల థియేటర్ వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టాలని.. అదే సమయంలో ఇరువర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయాలు తీసుకోవాలని కమిటీ భావిస్తుంది. నిర్మాతల నుంచి అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి పెద్దలు కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ సమస్య పరిష్కరిస్తే దశాబ్ధాలుగా థియేటర్ సిస్టమ్‌లో పర్సెంటేజ్ గురించి జరుగుతున్న పోరాటం కొలిక్కి వచ్చినట్లే. మరోవైపు పర్సెంటేజ్‌కు ఓకే అంటున్న నిర్మాతలు.. థియేటర్స్ సీటింగ్, సౌండ్, స్క్రీనింగ్ సహా టికెట్ ట్రాన్స్‌పరెన్సీ కూడా చూపించాలంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 425, ఏపీలో 900 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. APలో 100 మల్టీప్లెక్స్ స్క్రీన్స్, తెలంగాణలో 425 స్క్రీన్స్ ఉన్నాయి. ఈ కమిటీ ఏర్పాటుపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇది రివ్యూ కమిటీలా కాకుండా.. థియేటర్స్ మనుగడ కోసం పనిచేసే యాక్షన్ కమిటీలా ఉండాలని సింగిల్ స్క్రీన్స్ యాజమాన్యం భావిస్తుంది. పెద్దలు మాత్రం ఇది స్మూత్‌గా జరుగుతుందని హామీ ఇస్తున్నారు. మరి ఈ కమిటీ ఇచ్చే నివేదికను అమలు పరుస్తారా.. తెలుగు సినిమా ఎగ్జిబిషన్ రంగంలో నిజమైన సంస్కరణలకు నాందీ పలుకుతారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉత్తర కొరియా ఫోన్ల వెనుక భయంకర నిజాలు.. ప్రతి 2 నిమిషాలకు స్క్రీన్‌షాట్
Hair Clips: హెయిర్ క్లిప్స్‌తో జుట్టుకు ప్రమాదం! నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే
సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం