సౌత్‌ సినిమాలకు దూరమవుతున్న రష్మిక మందన్న, సాయి పల్లవి, శ్రీలీల

Edited By: Phani CH

Updated on: Nov 02, 2025 | 8:38 PM

టాలీవుడ్ స్క్రీన్ మీద హీరోయిన్స్ షార్టేజ్ ఎప్పుడూ కనిపిస్తుంటుంది. ఈ ప్రాబ్లమ్‌కు మెయిన్‌ రీజన్‌ ఇక్కడ సక్సెస్ అయిన బ్యూటీస్ బాలీవుడ్ వైపు చూడటం. ప్రజెంట్ టాలీవుడ్‌లో ఫామ్‌లో ఉన్న భామలంతా నార్త్ వైపు చూస్తున్నారు. సీనియర్స్‌ను చూసిన జూనియర్స్‌ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నారు. ప్రజెంట్ నేషనల్ లెవల్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న సౌత్ బ్యూటీ రష్మిక మందన్న.

బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ, నెమ్మదిగా సౌత్ సినిమాలకు దూరమవుతున్నారు. పాన్ ఇండియా ట్యాగ్ ఉన్న సినిమా అయితే డాటెడ్ లైన్స్‌లో సైన్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు నేషనల్‌ క్రష్‌. సాయి పల్లవి కూడా నార్త్‌ మీదే ఫోకస్ చేస్తున్నారు. ప్రజెంట్ రామాయణతో పాటు ఆమిర్ తనయుడు హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు నేచురల్ బ్యూటీ. ఈ ప్రాజెక్ట్స్‌ తరువాత ఏ సినిమా చేస్తారన్న విషయంలో క్లారిటీ లేదు. ఈమె కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వైపే చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మాస్ జాతరతో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన శ్రీలీల చేతిలో నెక్ట్స్ ఒకే ఒక్క సౌత్ ప్రాజెక్ట్ ఉంది. పవన్‌కు జోడీగా ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమాలో నటిస్తున్నారు ఈ భామ. ఆ తరువాత పూర్తిగా బాలీవుడ్‌ సినిమాలే చేసేలా కెరీర్‌ ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిన్న వరద, నేడు బురద.. ఎటు చూసినా హృదయ విదారకమే

రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నవంబర్‌ 4 నాటికి మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా ??

వినియోగదారులకు అలర్ట్‌.. నవంబర్ 1 నుంచి మారిన నిబంధనలు ఇవే!

అల్లు శిరీష్ నిశ్చితార్థం వేడుక ఫోటోలు వైరల్