తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. అట్లనే.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్నటికి నిన్న ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారి తండ్రి మరణ వార్త మరిచిపోక ముందే మరొక దర్శకుడి మరణ వార్త టాలీవుడ్ ని షాక్ కు గురి చేసింది. ప్రముఖ దర్శకుడు S రాంబాబు హఠాన్మరణం చెందారు. జులై 08 అర్ధరాత్రి సమయంలో ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది.
తన సినిమా ప్రివ్యూ చూస్తున్న టైంలోనే… రాంబాబు ఉన్నట్టుండి కుప్పకూలడం టాలీవుడ్‌లో అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. ఇక ప్రస్తుతం డైరెక్టర్ రాంబాబు బ్రహ్మాండ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి కావడంతో ప్రసాద్ ల్యాబ్ లో ఫైనల్ వర్షన్ చూస్తున్నారు రాంబాబు. ఈ క్రమంలోనే దర్శకుడు రాంబాబు ఇంటర్వెల్ టైంలో వాష్ రూమ్ వెళ్లి అక్కడే పడిపోయారు. అయితే ఈ విషయాన్ని ఎవరు గుర్తించలేదు. సినిమా పూర్తి అయినప్పటికీ ఆయన బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి డైరెక్టర్ కోసం వెతకగా వాష్ రూంలో పడి ఉన్న రాంబాబుని వెంటనే ఆస్పత్రికి తరలించారు. హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న డైరెక్టర్ రాంబాబు జులై 8న అర్ధరాత్రి 12 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూశారు. రాంబాబు మరణ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు డైరెక్టర్ మరణం పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇక రాంబాబు మరణ విషయం తెలిసిన బ్రహ్మాండ సినిమా చిత్ర బృందం ఆయనకు నివాళులు అర్పించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలాకరిలో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కానీ ఇంతలోపే డైరెక్టర్ కన్నమూయడంతో చిత్ర బృందం షాక్ లోకి వెళ్లిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్.. త్వరపడండి ఉల్లాసంగా ఉత్సాహంగా
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి