షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. హీరోలు, దర్శకులు తమ చిత్రాలను పూర్తి చేసేందుకు శరవేగంగా పని చేస్తున్నారు. నాని ప్యారడైజ్, ప్రభాస్ ఫౌజీ, మహేష్ వారణాసి, అల్లు అర్జున్ AA22 వంటి పలు క్రేజీ ప్రాజెక్టుల చిత్రీకరణ వివిధ స్టూడియోలు, లొకేషన్లలో జరుగుతోంది. ఈ బిజీ షెడ్యూల్స్‌లో ఎక్కడ ఏ హీరో షూటింగ్‌లో పాల్గొంటున్నారో తెలుసుకోండి.
టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌ల సందడి ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. చలిని సైతం లెక్క చేయకుండా, నటీనటులు తమ సినిమాలను సకాలంలో పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న చిత్రాల హీరోలు మినహా, మిగిలిన వారంతా కెమెరా ముందు బిజీగా ఉన్నారు. వివిధ స్టూడియోలు, లొకేషన్లలో పలు చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. హలో నేటివ్ స్టూడియోలో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ప్యారడైజ్, శ్రవణ్ హీరోగా ఎంఎస్ రాజు తెరకెక్కిస్తున్న చిత్రం, శర్వానంద్ భోగి, ప్రశాంత్ వర్మ అధిర, సంగీత్ శోభన్ హీరోగా నిహారిక నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
