TV9 Digital ET TOP9 News | కత్రినాను చంపేందుకు కుట్ర | డబ్బులిచ్చా కాబట్టే.. ఆ సర్వేలో నేనే No.1..
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సీతారామమ్. పీరియాడిక్ రొమాంటిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
వెల్ కమ్ టూ టాప్ 9 ఈటీ.. జూలై 25th టాప్ 9 న్యూస్ ఏంటో ఇప్పుడు క్విక్ గా చూసేద్దాం.
1. Sita ramam –
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సీతారామమ్. పీరియాడిక్ రొమాంటిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక మృణాల్ ఠాకూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తున్నారు.
2. Laththi –
విశాల్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా లాఠీ. మల్టీపుల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. విశాల్ కానిస్టేబుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ఈ సినిమాకు వినోద్ కుమార్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతమందించారు.
3. Bimbisara –
కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఫాంటసీ డ్రామా బింబిసారా. రీ ఇన్‌కార్నేషన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో జూలై 29న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.
4. Dosa King –
జై భీమ్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకుడు టీజే జ్ఞానవేల్ మరో ఇంట్రస్టింగ్ మూవీకి రెడీ అవుతున్నారు. తమిళనాట సంచలనం సృష్టించిన ఓ కేసు ఆధారంగా సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఓ రెస్టారెంట్ చైన్ ఓనర్ మీద ఓ సాధారణ మహిళ చేసిన పోరాటం నేపథ్యంలో ‘దోశా కింగ్’ అనే టైటిల్‌తో సినిమాను తెరకెక్కించనున్నారు.
5. Janhvi Kapoor –
స్టార్ కిడ్ జాన్వీ కపూర్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహి. ఈ సినిమాలో క్రికెటర్‌గా నటిస్తున్నారు జాన్వీ కపూర్. ఈ మూవీ కోసం ఆరు నెలల పాటు క్రికెట్ కోచింగ్ కూడా తీసుకున్నారు జాన్వీ. తన కెరీర్‌లో ఇదే టఫ్ జాబ్ తాజాగా ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.
6. Heeramandi –
గంగూబాయ్ కతియావాడి సినిమా తరువాత బ్రేక్ తీసుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నెక్ట్స్ మూవీ వర్క్ స్టార్ట్ చేశారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న హీరమండి సినిమాకు కాస్టింగ్ సెలక్షన్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో అదితి రావ్ హైదరీకి జంటగా ఫర్దీన్ ఖాన్‌ను తీసుకున్నారు భన్సాలీ.
7. SpeillBerg –
హాలీవుడ్ డైరెక్టర్ స్పీల్ బర్గ్ తన జీవిత కథ ఆధారంగా తానే ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. కుటుంబ నేపథ్యంతో పాటు కెరీర్ ఎర్లీ డేస్‌ను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ టోరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించబోతున్నారు.
8.
ఆన్‌స్క్రీన్ లో కంటే ఆఫ్ స్క్రీన్‌లో చాలా చలాకీగా ఉండే సాయి.. కరణ్ టాక్ షోలో.. ఆర్‌మాక్స్ సర్వే గురించి కెమెడీగా చేశారు. ఆర్‌మ్యాక్స్ సర్వే..ఇండియన్ ఫిల్మ్ హీరోయిన్ల లిస్టులో నెంబర్ 1 గా ఎలా నిలిచారు అని కరణ్, సామ్‌ను అడిగారు. అందుకు సామ్ వెంటనే.. భారీగా డబ్బులు ఇచ్చా కాబట్టి అంటూ నవ్వేశారు. అయితే ఇప్పుడిదే కామెడీ ఆన్సర్.. ఈ బ్యూటీని… నెట్టింట ట్రోల్ అయ్యేలా చేస్తోంది. సమంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను కూడా హర్ట్ అయ్యేలా చేస్తోంది.
9.
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా – విక్కీ కి చంపుస్తామంటూ బెదిరింపు రావడం ప్రస్తుతం బీ టౌన్ ను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఓ ఆగంతకుడు కత్రినా.. విక్కీ ని చంపేస్తా అంటూ.. తాజాగా కత్రినకు ఇనస్టాలో వార్న్ చేశారు. దీంతో కత్రినా అండ్ విక్కీ.. ముంబయ్‌లోని శాంతాక్రూజ్ పోలీసులను ఆశ్రయించారు. బెదిరింపుల గురించి చెప్పి కేస్ ఫైల్ చేశారు. ఇక ఈబెదిరింపులను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. IT Act కింద కేసే నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..