ఇది యాపారం అంటున్న హీరోయిన్లు.. ముద్దుగుమ్మల మాస్ ప్లానింగ్ మామూలుగా లేదుగా

Edited By: Phani CH

Updated on: Oct 22, 2025 | 1:55 PM

దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. క్రేజ్ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి.. ఆ వెనకేసుకున్న నాలుగు రాళ్లను బిజినెస్ చేసి 10 రాళ్లు చేయాలి.. ఇదే ఇప్పుడు మన హీరోయిన్ల ప్లాన్. ఒక్కరు ఇద్దరు కాదు.. చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాల్లో సంపాదించి.. వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆ బిజినెస్ ఉమెన్ ఎవరో చూద్దామా..? సినిమాల్లో కెరీర్ ఎప్పుడూ ఒకేలా ఉంటుందనే గ్యారెంటీ ఉండదు.. అందుకే క్రేజ్ ఉన్నపుడే కెరీర్‌తో పాటు ఫ్యూచర్ కూడా చక్కబెట్టుకుంటున్నారు హీరోయిన్లు.

ఈ మధ్యే రష్మిక కూడా ఈ లిస్టులో చేరిపోయారు. ఈమె డియర్ డైరీ పేరుతో పర్ఫ్యూమ్ బిజినెస్ స్టార్ట్ చేసారు రష్మిక. తన బ్రాండ్‌ను తానే ప్రమోట్ చేసుకుంటూ.. ఫ్రెండ్స్‌కు పర్ఫ్యూమ్స్ గిఫ్ట్‌గా పంపిస్తున్నారు. ఆ మధ్య బన్నీతో పాటు మరికొందరు హీరో, హీరోయిన్లకు తన డియర్ డైరీ పర్ఫ్యూమ్స్ పంపించారు రష్మిక. అలాగే కీర్తి సురేష్ సైతం భూమిత్ర స్కిన్ కేర్ బ్రాండ్ మొదలు పెట్టారు. అందులో సోప్స్, ఆర్గానిక్ బ్యూటీ ప్రాడక్ట్స్ తయారవుతాయి. తన బ్రాండ్‌ను తానే ప్రమోట్ చేసుకుంటున్నారు కీర్తి. ఇక తమన్నా భాటియా సైతం వైట్ అండ్ గోల్డ్ పేరుతో జ్యూవెలరీ బిజినెస్ చేస్తున్నారు. సీనియర్ హీరోయిన్లు కూడా బిజినెస్‌తో బిజీ బిజీగా ఉన్నారు. శ్రీ స్పందన పేరుతో శ్రీయ స్పా కంపెనీ స్టార్ట్ చేసారు.. అలాగే ఫిట్ నెస్ ఫ్రీక్‌గా ఉండే రకుల్ జిమ్ బిజినెస్‌తో బిజీ అయిపోయారు. అలాగే కాజల్ మర్సలా అనే క్లోత్ వేర్‌తో పాటు.. ఆయుర్వేదిక్ బేబీ ప్రాడక్ట్స్ బిజినెస్ చేస్తున్నారు. ఇలియానా గోవాలో రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నారు. ఇలా మన హీరోయిన్లంతా బిజినెస్‌లోనూ సత్తా చూపిస్తున్నారిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sreeleela: హిందీలో బిజీ అవుతున్న తెలుగమ్మాయి.. ఏముందమ్మా అక్కడ..

Sharwanand: టర్న్ అవనున్న శర్వానంద్ టైమ్.. ఇక తగ్గేదేలే

Naveen Polisetty: ప్రమోషన్ తో కుమ్మేస్తున్న నవీన్ పోలిశెట్టి..

Bahubali: బాహుబలి ఎపిక్.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. మరల బాక్సాఫీస్ బద్దలే

Published on: Oct 22, 2025 01:55 PM