Sreeleela: హిందీలో బిజీ అవుతున్న తెలుగమ్మాయి.. ఏముందమ్మా అక్కడ..
సినిమాలు చేసినా చేయకపోయినా శ్రీలీల పేరు మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. మరోసారి ఇదే జరిగింది. అమ్మడి తీరు చూస్తుంటే ముంబైలోనే సెటిల్ అయిపోయేలా కనిపిస్తుంది. అక్కడ్నుంచి సినిమాలే కాదు కమర్షియల్ యాడ్స్ కూడా వస్తున్నాయి. పైగా స్టార్స్ నుంచి పిలుపు అందుతుంది. దాంతో శ్రీలీల కెరీర్‌కు మరోసారి బూస్టప్ కనిపిస్తుంది.
పైకి ఖాళీగా ఉన్నట్లే కనిపిస్తుంది కానీ నిజానికి చాలా బిజీగా ఉన్నారు శ్రీలీల. అస్సలు ఖాళీ లేకుండా ఉన్నారీ భామ. ఓవైపు టాలీవుడ్.. మరోవైపు బాలీవుడ్.. ఇంకోవైపు కోలీవుడ్.. అన్ని ఉడ్లలో మోస్ట్ వాంటెడ్ అయిపోతున్నారు శ్రీలీల. ముఖ్యంగా ముంబై నుంచి అమ్మడికి అదిరిపోయే అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ కార్తిక్ ఆర్యన్ హీరోగా శ్రీలీల హిందీలో డెబ్యూ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. 2026 ఫస్టాఫ్‌లో విడుదల కానుంది ఈ చిత్రం. ఇది సెట్స్‌పై ఉండగానే.. మరో రెండు మూడు ఆఫర్స్ శ్రీలీల ఖాతాలో చేరిపోయేలా ఉన్నాయి. మరోవైపు రణ్‌వీర్ సింగ్‌తో అట్లీ దర్శకత్వంలో ఓ యాడ్ చేసారు శ్రీలీల. దీన్ని ఏకంగా ఓ సినిమా రేంజ్‌లో తెరకెక్కించారు అట్లీ. తెలుగులోనూ ఫుల్ బిజీగా ఉన్నారు శ్రీలీల. ఇప్పటికే పవన్‌తో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ పూర్తి కాగా.. మాస్ జాతర అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ రెండింటి తర్వాత శ్రీలీల తెలుగులో గ్యాప్ తీసుకుంటున్నారు. మరోవైపు తమిళంలో పొంగల్‌కు పరాశక్తితో రాబోతున్నారు. మూడు ఇండస్ట్రీలను కవర్ చేస్తూ సూపర్ బిజీ అయిపోయారు ఈ బ్యూటీ. వరస సినిమాలైతే చేస్తున్నారు కానీ విజయాల విషయంలో మాత్రం కాస్త వెనకబడ్డారు శ్రీలీల. చివరగా గుంటూరు కారం పర్లేదనిపిస్తే.. భగవంత్ కేసరి హిట్ లిస్టులో చేరింది. ఆ తర్వాత పుష్ప 2లో కిస్ కిస్ కిసిక్ పాటతో దేశాన్ని ఊపేసారు ఈ బ్యూటీ. ఇప్పుడు మళ్లీ జోరు పెంచేస్తున్నారు. మరి ఇందులో ఆమె కోరుకున్న విజయం ఏ ఇండస్ట్రీ నుంచి వస్తుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sharwanand: టర్న్ అవనున్న శర్వానంద్ టైమ్.. ఇక తగ్గేదేలే
Naveen Polisetty: ప్రమోషన్ తో కుమ్మేస్తున్న నవీన్ పోలిశెట్టి..
Bahubali: బాహుబలి ఎపిక్.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. మరల బాక్సాఫీస్ బద్దలే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

