పవర్ ఫుల్ బ్యాకప్‌ తో వస్తున్న హీరోయిన్లు

Edited By:

Updated on: Nov 25, 2025 | 9:31 PM

టాలీవుడ్‌లో కొంతమంది హీరోయిన్లు సరైన విజయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే అత్తారింటికి దారేది డైలాగ్ గుర్తుచేస్తూ, భారీ బడ్జెట్ సినిమాలతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల చిత్రాలపై రాశీ ఖన్నా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణి వసంత్ వంటి తారలు ఆశలు పెట్టుకున్నారు. ఇది వారి కెరీర్‌కు చివరి అవకాశం కావచ్చు.

మీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా.. అదున్నంత వరకు మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు అంటూ అత్తారింటికి దారేదితో డైలాగ్ ఉంటుంది కదా..? ఇప్పుడు టాలీవుడ్‌లో కొందరు ఫ్లాప్ హీరోయిన్లకు కూడా ఈ డైలాగ్ బాగా సెట్ అవుతుంది. ట్రాక్ రికార్డుతో పనిలేకుండా పవర్ ఫుల్ సినిమాలతో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు వాళ్లు. ఇంతకీ ఎవరా బ్యూటీస్..? మిస్టర్ బచ్చన్‌లో భాగ్యశ్రీ బోర్సేను చూసినపుడు ఈ అమ్మాయి చాలా పెద్ద స్టార్ అవుతుందని అనుకున్నారంతా. ఆఫర్స్ కూడా అలాగే వచ్చాయి.. కానీ కోరుకున్న విజయమే రాలేదింకా..! మొన్నొచ్చిన కింగ్డమ్ సైతం అంతగా ఆడలేదు.. దాంతో ఈమె ఆశలన్నీ ఆంధ్రా కింగ్ తాలూక సినిమాపైనే ఉన్నాయి. తెలుసు కదా అంటూ వచ్చిన రాశీ ఖన్నాకు టైమ్ పెద్దగా కలిసిరాలేదు. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీనిథి శెట్టి కూడా నటించారు. రాశీ ఖన్నా చేతిలో ఉన్న మరో ఆయుధం ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తైపోయింది. ఉస్తాద్‌లో శ్రీలీల కూడా నటిస్తున్నారు. కొన్నేళ్లుగా సరైన హిట్ లేని ఈ భామ సైతం పవన్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. మాళవిక మోహనన్ వెనక ప్రభాస్ ఉన్నారు. రాజా సాబ్‌తో టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారీమే. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని.. దాంతో తన కెరీర్ వెలిగిపోతుందని నమ్ముతున్నారు మాళవిక. హరిహర వీరమల్లుతో హిట్ కొట్టలేకపోయిన నిధి అగర్వాల్ ఆశలు సైతం రాజా సాబ్‌పైనే ఉన్నాయి. మదరాసితో షాక్ తిన్న రుక్మిణి వసంత్.. కాంతారతో అదరగొట్టారు. తెలుగులో ఎన్టీఆర్ డ్రాగన్‌తో అకౌంట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు ఈ బ్యూటీ. మొత్తానికి భారీ సినిమాలతో మంచి కమ్ బ్యాక్ కోసం చూస్తున్నారు ఈ హీరోయిన్లు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahavatar Narasimha: ఆస్కార్ బరిలో మహావతార్‌ నరసింహ

Keerthy Suresh: తన వీక్‌నెస్ ఏంటో బయటపెట్టిన కీర్తీ సురేష్‌

TOP 9 ET News: యూట్యూబ్‌పై అఖండ సర్జికల్ స్ట్రైక్.. బాలయ్యా.. మజాకా !!

6,6,6,6,6,6… సిక్సర్ల సునామీ.. 12 బంతుల్లో 50 రన్స్

పంట కాలువలో కొట్టుకుపోయిన కారు డ్రైవర్‌ ఏమయ్యాడంటే