Geetha Singh: ఒక్కగానొక్క కొడుకుపోయిన బాధలో…

Updated on: Feb 22, 2025 | 9:00 AM

నార్త్ ఇండియాకు చెందిన గీతా సింగ్ లేడీ కమెడియన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో ఎవడి గోల వాడిదే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైంది. సినిమాలో లీడ్ రోల్ పోషించి ఆడియెన్స్ ను అలరించింది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. అయితే గత కొంత కాలంగా గీతా సింగ్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. 2019 తర్వాత కేవలం రెండు సినిమాల్లో మాత్రమే ఈమె కనిపించింది.

ఇదిలా ఉంటే సుమారు రెండేళ్ల క్రితం గీతా సింగ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. చేతికి అందివచ్చిన కుమారుడు సడెన్ గా యాక్సిడెంట్ లో చనిపోవడంతో గీతా సింగ్ కోలుకోలేకపోయింది. ఫిబ్రవరి 18 గీతాసింగ్ కుమారుడి వర్ధంతి. ఈ సందర్భంగా తన కొడుకుకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిందామె. ‘తన కొడుకు తనతో ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ.. మిస్ యూ రా’ అంటూ భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు గీతా సింగ్ కు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఖతర్నాక్‌ ఐడియా.. 15 నిమిషాల్లో ఎగ్జామ్‌ సెంటర్‌కి చేరుకున్న విద్యార్ధి..

ఆ గ్రామానికి ఏమైంది? కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం

కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారా ?? అయితే ఇది మీ కోసమే!

గుడి వద్ద ఓ ముక్క.. పొలంలో మరో ముక్క.. ఇది మాములు రాయి అనుకుంటే పొరపాటే

కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? పాలలో ఈ పొడి కలిపి తాగితే..