లెంగ్తీ రన్ టైమ్‌కే ఓటేస్తున్న మేకర్స్

Updated on: Dec 19, 2025 | 5:16 PM

సినిమాల నిడివి పెరుగుతున్న ధోరణి ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. యానిమల్, పుష్ప 2 వంటి లెన్తీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో, దర్శక నిర్మాతలు ఇకపై రన్ టైమ్ విషయంలో రాజీ పడటం లేదు. త్వరలో విడుదల కానున్న ప్రభాస్ ది రాజాసాబ్, తమిళ జెన్ నాయగన్ చిత్రాలు కూడా మూడు గంటలకు పైగా నిడివితో వస్తున్నాయి.

కొంతకాలంగా వెండితెరపై నిడివి ఎక్కువగా ఉన్న చిత్రాల ప్రాబల్యం పెరుగుతోంది. పాన్ ఇండియా ట్రెండ్‌లో కథను సమగ్రంగా వివరించాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఇలాంటి ప్రయోగాలకు సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ జానర్‌లో తెరకెక్కుతున్న స్టార్ హీరోల చిత్రాలకు ఈ ఫార్ములా చక్కగా వర్కవుట్ అవుతోంది. గతంలో యానిమల్, పుష్ప 2 వంటి చిత్రాలు విడుదలైనప్పుడు వాటి నిడివిపై విస్తృత చర్చ జరిగింది. ఇంత పొడవైన చిత్రాలను ప్రేక్షకులు చూస్తారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించి, ఈ సందేహాలకు తెరదించాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎన్‌పీఎస్‌లో కీలక మార్పు రూ.8 లక్షలు విత్ డ్రా

ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం

మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ.. ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?

టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ

యువత ఆకస్మిక మరణాలకు కారణమేంటో తేల్చేసిన ఎయిమ్స్‌