Nidhhi Agerwal: ప్రభాస్ సినిమాపై ఆశలు పెట్టుకున్న నిధి
ది రాజాసాబ్ సినిమాపై మాళవిక శర్మ, నిధి అగర్వాల్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు నాలుగు సీన్లకు, నాలుగు పాటలకు పరిమితం కాదని మాళవిక అన్నారు. రాజాసాబ్‌లో తన పాత్ర టాలీవుడ్ ఎంట్రీకి సరైనదని ఆమె నమ్ముతున్నారు. నిధి అగర్వాల్ కూడా ఈ సినిమాతో విజయం సాధించాలని ఎదురుచూస్తున్నారు, గత వైఫల్యాల తర్వాత ఇది ఆమెకు కీలకం.
కమర్షియల్ సినిమాలంటే హీరోయిన్లకు నాలుగు సీన్లు.. నాలుగు పాటలుంటాయనుకుంటే పొరపాటే. ఇప్పుడొస్తున్న కమర్షియల్ మూవీస్ అంతకు మించి ఉంటున్నాయి… అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ నేను రాజాసాబ్‌లో చేసిన రోలే అంటున్నారు మాళవిక. ఈ మూవీ రిలీజ్ కోసం ఆమెతో పాటు నిధి అగర్వాల్ కూడా వెయిటింగ్‌లో ఉన్నారు. సిల్వర్ స్క్రీన్ మీద హిట్ అనే పదం విని చాలా ఏళ్లే అయింది నిధి అగర్వాల్‌కి. రీసెంట్‌గా వచ్చిన హరిహరవీరమల్లులో పంచమి కేరక్టర్ కలిసొస్తుందనే అనుకున్నారు నిధి. అందులో ఇంటర్వెల్‌లో సడన్ షేడ్ కూడా ప్లస్ అవుతుందనుకున్నారు. కానీ అనుకున్నదొకటి అయ్యిందొకటి. అందుకే ఇప్పుడు రాజాసాబ్ మీద ఆశలు పెంచుకుంటున్నారు. 2026 జనవరి స్టార్టింగ్‌లోనే పాజిటివ్ వైబ్ స్టార్ట్ కావాలని భగవంతుడిని కోరుకుంటున్నా అంటున్నారు నిధి. ఈ సినిమా గురించి మాళవిక రీసెంట్‌గా చాలా బజ్ క్రియేట్ చేశారు. కమర్షియల్ సినిమాల్లో ఆఫర్స్ అంటే నాలుగు సీన్లు, నాలుగు పాటలుంటాయని అనుకున్నారట మాళవిక. కానీ ది రాజాసాబ్‌లో తన రోల్ విన్నాక టాలీవుడ్ ఎంట్రీకి పర్ఫెక్ట్ సినిమా ఇదేననిపించిందట. మా డార్లింగ్ సినిమా మీద మీరు పెట్టుకున్న హోప్స్ తప్పక నెరవేరాలండీ అంటూ మాళవికను విష్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర
దోమలను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ??
ఈ పొరపాట్లు చేస్తున్నారా ?? ఫ్లైట్ మిస్ అవుతుంది జాగ్రత్త !!
Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
పెరుగుతున్న డయాబెటిస్ కేసులు.. స్కిన్ క్రీమ్ రూపంలో ఇన్సులిన్