మాళవిక Vs నిధి అగర్వాల్‌.. రాజాసాబ్‌ వీరికి లైఫిస్తారా

Edited By:

Updated on: Dec 29, 2025 | 5:09 PM

ది రాజాసాబ్‌ ఈవెంట్ కోసం అభిమానులు, చిత్ర బృందం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌కు సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా ఈ సినిమా నిలవాలని కోరుకుంటున్నారు. దర్శకుడు మారుతి తన పట్టుని చాటుకుంటూ వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కూడా ఈ చిత్రం విజయంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఖైతలాపూర్‌ గ్రౌండ్స్‌లో ఈవెంట్ భారీగా జరుగుతుంది.

ది రాజాసాబ్‌.. రాజాసాబ్‌.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాటే. రాజాసాబ్‌ ఈవెంట్‌ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. డిసెంబర్‌ ఎండింగ్‌లోనే సంక్రాంతి వచ్చినంత సంబరంగా ఉందంటున్నారు. వాళ్ల ఆనందం సంగతి సరే.. ఈ సినిమా సక్సెస్‌ అయితే.. నిజంగా పార్టీ చేసుకోవాలని ఎదురుచూస్తున్న వారు ఎవరు? చూశారు కదా.. ఆ రేంజ్‌లో జరుగుతున్నాయి ది రాజాసాబ్‌ ఈవెంట్‌ ఏర్పాట్లు. మీరు ఇష్టంగా వచ్చేయండి.. మేం గ్రాండ్‌గా రెడీ చేస్తున్నామని చెప్పకనే చెబుతున్నారు మేకర్స్. ఈ సినిమా సక్సెస్‌ కోసం ప్రతి అడుగునూ మరింత కేర్‌ఫుల్‌గా ప్లాన్‌ చేస్తున్నారు. ఖైతలాపూర్‌ గ్రౌండ్స్ లో ది రాజాసాబ్‌ ఈవెంట్‌ కోసం అభిమానులే కాదు, హీరో, హీరోయిన్లు, కెప్టెన్‌.. అందరూ వెయిట్‌ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ రిలీజుల్ని మిస్‌ అయిన ప్రభాస్‌కి ది రాజాసాబ్‌ సంక్రాంతి బ్లాక్‌ బస్టర్‌ కావాలనే కోరిక ఎక్కువగానే ఉంది. ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ మీద వెయిట్‌ చేస్తున్న మారుతి కూడా ది రాజాసాబ్‌ పక్కా పొంగల్‌ సినిమా అని ఫిక్సయ్యారు. ఆడియన్స్ కి కావాల్సినంత వినోదాన్ని పంచడానికి సిద్ధమంటున్నారు. తనకు బాగా అలవాటైన జోనర్‌ కాబట్టి, ఈ జోనర్‌లో ప్రేక్షకుల నాడి తనకు తెలుసన్నది ఈ డైరక్టర్‌లో ఉన్న ధీమా. ది రాజాసాబ్‌ సక్సెస్‌ కోసం టోటల్‌ టీమ్‌ ఎంత ఈగర్‌గా వెయిట్‌ చేస్తోందో.. అంతకన్నా ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇద్దరు లేడీస్‌.ఈ ఇయర్‌ మిస్‌ అయిన హిట్‌ని, నెక్స్ట్ ఇయర్‌ స్టార్టింగ్‌లోనే చూడాలనుకుంటున్నారు నిధి అగర్వాల్‌. అటు తెలుగు క్రేజ్‌ తెచ్చుకోవడానికి ది రాజాసాబ్‌ని మించిన ప్రాజెక్ట్ ఏం ఉంటుందన్నది మాళవిక మోహనన్‌ మనసులో మాట… సో ఇంత మంది మనసులో ఉన్న కలలన్నీ ఇవాళ వేదిక మీద వినిపించబోతున్నాయంటూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర

పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే

షుగర్ పేషంట్స్‌కి స్వీట్ వార్నింగ్.. చెక్కర కంటే బెల్లం యమా డేంజర్ గురూ

ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..

షాపింగ్ చేయడం కూడా ఒక రోగమే.. దాని వాళ్ళ కలిగే నష్టాలు తెలిస్తే షాకే