క్రిస్మస్ రోజే అరడజను డిఫెరెంట్ సినిమాలు.. వేటికవే భిన్నం
కొత్త ఏడాది ముందు, డిసెంబర్ చివరి వారంలో బాక్సాఫీస్ వద్ద భారీ పోరుకు రంగం సిద్ధమైంది. క్రిస్మస్ వీకెండ్‌లో దాదాపు 8 తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి. యాక్షన్, ఫాంటసీ, హారర్ వంటి వివిధ జోనర్లలో వస్తున్న ఈ చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. అగ్ర నిర్మాతలు, చిన్న నిర్మాణ సంస్థలు ఈ రేసులో ఉన్నాయి, దీంతో థియేటర్లలో సందడి నెలకొననుంది.
మరో 10 రోజుల్లో కొత్త ఏడాది రాబోతుంది.. ఆ లోపు మిగిలింది ఒక్క శుక్రవారం మాత్రమే..! దానికోసం పెద్ద యుద్ధమే జరుగుతుంది. 2025 లాస్ట్ వీక్‌లో అన్నీ డిఫెరెంట్ జోనర్ సినిమాలే వస్తున్నాయి. ఒకదానితో ఒకటి అస్సలు పొంతనే లేదు. అగ్ర నిర్మాణ సంస్థలు, చిన్న నిర్మాతలు కలగలిపి దండయాత్రకు రెడీ అవుతున్నారు. మరి అవేంటో చూద్దామా..? ఒక్క వారం.. అరడజన్‌కు పైగానే సినిమాలు.. డిసెంబర్ చివరి వారంలో బాక్సాఫీస్ పరిస్థితి ఇది. ఏకంగా 8 సినిమాలు క్రిస్మస్ వీకెండ్ వచ్చేస్తున్నాయి. ఇందులో వేటికవే డిఫెరెంట్ జోనర్‌లో వస్తున్నాయి. వైజయంతి మూవీస్ నుంచి వస్తున్న ఛాంపియన్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా వస్తుంది. 1940స్ నేపథ్యంలో వస్తున్న సర్వైవల్ వార్ సినిమా ఇది. క్రిస్మస్‌కే వస్తున్న మరో డిఫెరెంట్ సినిమా శంబాలా. సైన్స్, దేవుడికి మధ్య జరిగే సోషియో ఫాంటసీ ఈ సినిమా. ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్స్‌లోనే విడుదలవుతుండటం గమనార్హం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌తో ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఈ మధ్య బాగా కలిసొస్తున్న హార్రర్ జోనర్‌లో ఈషా సినిమా వస్తుంది.. బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. బలగం తరహాలో సాగే తెలంగాణ బ్యాక్‌డ్రాప్ సినిమాగా దండోరా వస్తుంది. శివాజీ, నవదీప్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వార్ డ్రామాగా మోహన్ లాల్ నటించిన వృషభ సైతం డిసెంబర్ 25నే రానుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కార్తి అన్నగారు వస్తారు రాబోతుంది. ఇలా డిసెంబర్ చివరి వారం అంతా విలక్షణ సినిమాలు రాబోతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు