రజినీని చూపిస్తూ.. స్టార్ హీరోలకు సజ్జనార్ చురకలు
సూపర్ స్టార్ రజనీకాంత్ తన నట ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు పలువురు ప్రముఖులు రజనీకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇదే సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రజనీపై ప్రశంసలు కురిపించారు.
ఆయనొక రియల్ సూపర్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటూ కొందరు సెలబ్రెటీలు డబ్బు కోసం ఎలాంటి యాడ్స్ చేయడానికైనా వెనుకాడటం లేదు. కాసులకు కక్కుర్తి పడుతూ బెట్టింగ్ యాప్స్, మోసపూరిత గొలుసుకట్టు కంపెనీలతో పాటు సమాజానికి తీవ్రంగా హాని చేసే అనేక సంస్థలను ప్రమోట్ చేస్తున్నారు. ఎంతో మంది జీవితాలను చేజేతులా నాశనం చేస్తున్నారు. కానీ, 50 ఏళ్ల మీ సినీ జీవితంలో మీరు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేయకపోవడం గొప్ప విషయం అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు . మిమ్మల్ని అభిమానించే వారిని మోసం చేయొద్దనే ఉద్దేశంతో మీరు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం అన్నారు. మాకు డబ్బే ముఖ్యం, సమాజం ఎటు పోయిన మాకేంటి అనుకునే ప్రస్తుత సెలబ్రిటీలు రజినిని స్ఫూర్తిగా తీసుకోవాలని.. బెట్టింగ్ యాప్స్, మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలతో పాటు సమాజాన్ని చిద్రం చేసే సంస్థలు ప్రమోషన్లకు దూరంగా ఉండాలన్నారు. ప్రతీ సెలబ్రిటీ రజినీలా సమాజ శ్రేయస్సుకు పాటుపడాలంటూ రాసుకొచ్చారు సజ్జనార్. దీంతో పాటు రజనీకి సంబంధించిన ఒక పేపర్ క్లిప్ ను కూడా సజ్జనార్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఆ పేపర్ ప్రకటనలో.. మనదేశంలో ఏ వాణిజ్య ప్రకటనల్లోనూ నటించని ఏకైక స్టార్ హీరో రజినీకాంతే అని ఉంది. ఎవరు ఎన్ని కోట్లు కుమ్మరిస్తామన్నా సరే… చేయనని రజినీ ససేమిరా అన్నారట. తాను ఏ యాడ్ చేసినా తన అభిమానులు గుడ్డిగా నమ్మేస్తారని.. దాంతో వాటిలోని లోటుపాట్లకి తాను బాధ్యుడిని అవుతానని.. కాబట్టి ఆ సంపాదన తన కొడ్డు అంటూ చెప్పేవారట రిజినీ. వీడియోల్లో నటించక్కర్లేదు కనీసం మీ ముఖాన్నయినా వాడుకోనివ్వండి అని రిక్వెస్ట్ చేసినా … రజినీ ‘నో…’ చెప్పేవారట. కానీ అలాంటి రజినీ.. తమిళనాడు ప్రభుత్వం 1980ల్లో ప్రారంభించిన పల్సో పోలియో చుక్కల మందు వ్యాప్తికి… మాత్రం పైసా తీసుకోకుండా నటించారట. దాంతో ఆ కార్యక్రమం గ్రామ గ్రామాల్లోకి కూడా చొచ్చుకెళ్లిందట. దెబ్బకు ‘రజినీ పోలియో చుక్కలు’ అనడం ప్రారంభించారట జనం. ఆ తర్వాత నేత్రదానం కోసం ఉచితంగా మరో ప్రకటనలో కూడా నటించారట రజినీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు
AP Rains: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో హైఅలర్ట్
కలర్ తక్కువంటూ కామెంట్లు.. ఛాతీపై టాటూతో నోరుమూయించిన హీరోయిన్
స్టార్ హీరోయిన్‌తో లిప్ లాక్! ఆమె నోటి దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడ్డ హీరో
Divvela Madhuri: బిగ్ బాస్‌లోకి మాధురి.. మరి దువ్వాడ సంగతేంటో?