చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

|

Jan 10, 2025 | 12:15 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గేమ ఛేంజర్ సినిమాకు కౌంట్ డౌన్ షురూ అయింది. ఈ మూవీ రిలీజ్ మరి కొన్ని గంటల్లో జరగనుంది. ఇక ఈక్రమంలోనే ఈమూవీ టీంకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. ఏపీలో మాదిరి తెలంగాణలోనూ... గేమ్ ఛేంజర్ మూవీ టికెట్ రేట్స్ పెంచుతూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

సినిమా రిలీజ్ రోజు… అంటే జనవరి 10న ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు పర్మిషన్‌ ఇస్తూ ఉత్తర్వుల్లో మెన్షన్ చేసింది. అదే విధంగా రిలీజ్‌ డే సింగిల్ స్క్రీన్స్‌లో అదనంగా 100 రూపాయలు, మల్టీప్లెక్స్‌ల్లో 150 రూపాయలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఇక జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతి నిరాకరించింది ప్రభుత్వం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: బన్నీ ఎఫెక్ట్ !! అసలు విషయం దాస్తున్న చరణ్‌

గుడిలో పెళ్లి తంతు జరిపిస్తున్న పురోహితుడు.. వాష్‌రూమ్‌కి వెళ్లిన వధువు.. చివరికి

ఇస్రో ప్రయోగం సక్సెస్‌.. ఇక అంతరిక్షంలోనూ వ్యవసాయం..

OYO: ప్రేమికులకు షాకిచ్చిన ఓయో.. ఈ కొత్త రూల్స్‌ ఫాలో అవ్వాల్సిందే

ప్రభుత్వ ఉద్యోగులకు 400% శాలరీ హైక్..