Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై మరోసారి సీఎం రేవంత్ కామెంట్స్

అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై మరోసారి సీఎం రేవంత్ కామెంట్స్

Phani CH

|

Updated on: Jan 24, 2025 | 1:55 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై దావోస్ లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటకు అల్లు అర్జున్ అక్కడకు రావడమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. దావోస్ లో మీడియా ప్రతినిధి ఒకరు తొ క్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌ నేరుగా బాధ్యుడు కాదు కదా అని ప్రశ్నించగా..

అందుకు రేవంత్ రెడ్డి… మహిళ మృతికి అల్లు అర్జున్ నేరుగా కారణం కాకపోయినప్పటికీ పరోక్షంగా ఆయనే కారణమని పోలీసులు భావించి ఉండవచ్చని అన్నారు. ‘‘రెండు రోజుల ముందు అనుమతి కోసం వస్తే.. పోలీసులు నిరాకరించారు. అయినా థియేటర్‌ వద్దకు అల్లు అర్జున్‌ వచ్చారు. ఈ క్రమంలో భారీగా అభిమానులు తరలిరావడంతో ఆయనతో వచ్చిన సెక్యురిటీ సిబ్బంది అక్కడున్న వారిని తోసేశారు. ఆ తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు. ఒక మనిషి చనిపోవడమన్నది ఆయన చేతుల్లో లేకపోవచ్చు. ఒక మహిళ చనిపోతే, 10-12 రోజులు బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది’’ అని అన్నారు. ‘పుష్ప2’ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) అరెస్టయి ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. తొక్కిసలాట ఘటన, తదనంతర పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు దావోస్‌ పర్యటనలో ఉన్న ఆయన ఆంగ్ల మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రేవంత్‌ రెడ్డి ఇలా స్పందించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: ఆ సినిమా తర్వాత రిటైర్ అవ్వాలనుంది.. రష్మిక షాకింగ్ కామెంట్స్

TOP 9 ET News: ఏంటీ.. చరణ్‌ సినిమాలో మోనాలిసానా? | రూ.200 కోట్లు దాటిన వెంకీ సినిమా కలెక్షన్స్

డబ్బిచ్చి మరీ జైలుకెళుతున్నారు! ఏమిటీ విచిత్రం?

పాఠశాలలో మహిళా టీచర్ తో హెడ్మాస్టర్‌ రాసలీలలు.. వీడియో వైరల్‌

అచ్ఛం మనిషిలాగే గాలిపటాన్ని ఎగరేసిన కోతి