క్రిప్టో కరెన్సీ మోసం, పోలీస్‌ కేస్‌! రియాక్టైన స్టార్ హీరోయిన్ !

Updated on: Mar 03, 2025 | 8:06 PM

స్టార్ హీరోయిన్ తమన్నా పై రీసెంట్ గా క్రిప్టో కరెన్సీ మోసం కేసులో చిక్కుకున్నారు.క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని జనాలను మోసం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. లాభాలు ఆశ చూపి 10 మంది నుంచి సుమారు రూ.2.40కోట్లు వసూలు చేశారని అశోకన్‌ అనే విశ్రాంత అనే ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్రిప్టో కరెన్సీ కంపెనీ 2022లో కోయంబత్తూరు మెయిన్ బ్రాంచ్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ తమన్నా పాల్గొన్నారు. దాంతో ఈ కేసులో తమన్నా పేరు కూడా వినిపించింది. అయితే తమన్నాను వించారించాలి అని పోలీసులు నిర్ణయించారు.ఈ క్రమంలోనే తమన్నా రియాక్టయ్యారు.ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆమె అన్నారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడని ఈమె.. క్రిప్టోకరెన్సీ, సంబంధిత కార్యకలాపాలలో తన ప్రమేయం గురించి పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయని..ఆ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అలాగే మీడియా ఇలాంటి నకిలీ, తప్పుడు పుకార్లు, నివేదికలను స్ప్రెడ్ చేయవద్దుని కోరారు. అంతేకాదు ఇలా తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేసే వారి పై తగిన చర్యలు తీసుకుంటామని.. ఇప్పటికే చర్యలు తీసుకోవడానికి తన టీమ్ కేసును దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఇక ఈమె రియాక్షన్ పక్కకు పెడితే.. లాభాలు చూపుతూ జనాలను మోసం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే నితీష్‌ జెయిన్‌(36), అరవింద్‌కుమార్‌(40)లను అరెస్ట్‌ చేశారు. ఇక ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్‌ అగర్వాల్‌లను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆయన ఫోన్ చేస్తే.. ప్రభాస్ భయపడిపోయాడట..

pushpa 2: గ్లోబల్ స్టేజ్ పై దుమ్మురేపిన పుష్ప 2.. టోటల్‌ పీలింగ్సే.. పీలింగ్స్‌!