Rajinikanth Birthday: దేశ వ్యాప్తంగా ఘనంగా సూపర్ స్టార్ పుట్టిన రోజు వేడుకలు

| Edited By: Ravi Kiran

Dec 13, 2023 | 12:31 PM

సూపర్‌స్టార్ రజినీకాంత్ బర్త్‌డేవేడుకలు ఘనంగా జరిగాయి. రజినీకాంత్‌కు సోషల్ మీడియా వేదికగా పలువురు నటులు బర్త్‌డే విషెశ్‌ చెప్పారు. అటు అభిమానులు తలైవా బర్త్‌డేను పండుగలా జరుపుకున్నారు. తమిళనాడులో సినిమా హీరోలకు అభిమానులతో పాటు భక్తులు కూడా ఉంటారు. ఇలాంటిదే తలైవా విషయంలోజరిగింది. మధురైకి చెందిన కార్తీక్ అనే అభిమాని రజనీకి గుడి కట్టాడు.

తలైవా బర్త్‌డే వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మధురైలో ఓ అభిమాని వినూత్నంగా వేడుకలు జరుపుకున్నాడు. సూపర్‌స్టార్ రజినీకాంత్ బర్త్‌డేవేడుకలు ఘనంగా జరిగాయి. రజినీకాంత్‌కు సోషల్ మీడియా వేదికగా పలువురు నటులు బర్త్‌డే విషెశ్‌ చెప్పారు. అటు అభిమానులు తలైవా బర్త్‌డేను పండుగలా జరుపుకున్నారు. తమిళనాడులో సినిమా హీరోలకు అభిమానులతో పాటు భక్తులు కూడా ఉంటారు. ఇలాంటిదే తలైవా విషయంలో జరిగింది. మధురైకి చెందిన కార్తీక్ అనే అభిమాని రజనీకి గుడి కట్టాడు. అందులో 250 కేజీల రజనీకాంత్ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. తమ కుటుంబంలో గత ఐదు తరాలుగా తలైవాపై వస్తున్న అభిమానాన్ని కొనసాగించాడు. టెంపుల్ కట్టి రజనీకాంత్‌ తన దేవుడిగా కొలుస్తున్నాడు. గతకొద్దిరోజుల క్రితమే కట్టించిన ఈగుడిలో.. బర్త్‌డే సందర్భగా ప్రత్యేక పూజలు చేశారు. పాలాభిషేకం చేసి దీపదూప నైవేథ్యాలు సమర్పించాడు. ఈ పూజల్లో కార్తీక్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు పాల్గొన్నారు.

ప్రతి ఆలయానికి ఓముఖ్యమైన రోజు ఉంటుంది.. మా ఆలయానికి సంబంధించిన రజనీ పుట్టినరోజే రజినీ చతుర్థశి. రజినీ కాంత్ 73వ పుట్టిన రోజు సందర్భంగా 73 బాషల్లో తలైవాకు శుభాకాంక్షలు తెలిపారు. దానికి సంబంధించిన లెటర్‌ను రజినీకాంత్‌కు పంపారు. తానే కాదు.. తన తర్వాతి తరాలు కూడా రజినీనే కుల దైవంగా కొలుస్తామని చెప్పారు అభిమాని కార్తీక్. సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఉన్న క్రేజ్‌ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తలైవా సినిమా రిలీజ్‌కి విదేశాల నుంచి ఇండియాకు వచ్చి చూసే వాళ్లు ఉన్నారు.

Published on: Dec 13, 2023 09:59 AM