Coolie: కూలీ నెం 1421.. రజనీ పట్టుకున్న ఈ బ్యాడ్జీ నంబర్‌ వెనుక

Updated on: Aug 08, 2025 | 8:47 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా కూలీ. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీతో పాటు ఆమిర్ లతో పాటు నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, రచితా రామ్, పూజా హెగ్డే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు.

అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే కూలీ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతకు ముందు రిలీజైన గ్లింప్స్, పోస్టర్లు కూడా సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే కూలీ సినిమా రిలీజైనప్పుడు రజనీకాంత్ చేతిలో 1421 అనే కూలీ బ్యాడ్జి నంబర్ కనిపించింది. అయితే పర్టిక్యులర్ గా ఇదే నంబర్ పెట్టడం వెనక ఒక హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్ స్టోరీ దాగి ఉంది. ఆగస్టు 2న చెన్నైలో కూలీ 2025 సినిమా ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. రజనీతో పాటు స్టార్ యాక్టర్లందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే సందర్భంగా లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో రజనీకాంత్ కూలీ బ్యాడ్జ్ నంబర్ 1421 అని పెట్టడానికి ఒక ప్రత్యేక కారణం ఉందన్నాడు. అదేంటంటే.. లోకేష్ తండ్రి ఒక సాధారణ బస్ కండక్టర్. అప్పట్లో ఆయన బ్యాడ్జ్ నంబర్ 1421. తన తండ్రికి గుర్తుగా ఇప్పుడు అదే నంబరును వాడినట్లు లోకేష్ చెప్పుకొచ్చారు. కూలీ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విడుదల దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారు. భారీ తారాగణం నటిస్తుండడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. రజినీ కెరీర్ లో 171వ సినిమాగ వస్తున్న ఈ సినిమా గురించి నిత్యం ఏదో న్యూస్ వైరలవుతోంది. ఈ చిత్రాన్ని దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయళం భాషలలోనూ ఈ సినిమా విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలు భారీ గా పెంచేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊరంతా మొసళ్ల పండుగ ఎక్కడో తెలుసా..

ప్రైవేట్‌ ట్యాక్సీలకు పోటీగా త్వరలో భారత్ ట్యాక్సీలు

3 కోట్లు పెడితే.. 40 కోట్లు వసూల్.. ఆగస్టు 8న తెలుగులో రిలీజ్

ఆహారం తింటున్న సింహాన్ని వీడియో తియ్యాలనుకున్నాడు.. అంతే

చనిపోయిన వ్యక్తి ఖాతాలోకి లక్షల కోట్లు..! అసలేం జరిగిందంటే.