Superstar Rajinikanth: రజినీ ధాటికి షేక్‌ అవుతున్న కడప.! ‘వెట్టయ్యన్‌’ షూటింగ్ కోసం తలైవా రాక.

Updated on: Feb 01, 2024 | 10:57 AM

తమిళ్ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్‌ కడప జిల్లాలో సందడి చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గ ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారీలో తలైవా లేటెస్ట్ మూవీ వెట్టియన్ షూటింగ్ జరిగింది. అందులో భాగంగా రజనీకాంత్ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను ఈ క్వారీలో చిత్రీకరించారు. దీంతో రజినీ కాంత్‌ను చూసేందుకు కడప జిల్లా చుట్టుపక్కల నుంచి చాలా మంది వచ్చారు. తళైవాను చూసి ఎగిరిగంతేశారు.

తమిళ్ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్‌ కడప జిల్లాలో సందడి చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గ ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారీలో తలైవా లేటెస్ట్ మూవీ వెట్టియన్ షూటింగ్ జరిగింది. అందులో భాగంగా రజనీకాంత్ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను ఈ క్వారీలో చిత్రీకరించారు. దీంతో రజినీ కాంత్‌ను చూసేందుకు కడప జిల్లా చుట్టుపక్కల నుంచి చాలా మంది వచ్చారు. తళైవాను చూసి ఎగిరిగంతేశారు. జైలర్ సూపర్ డూపర్ హిట్టు తర్వాత… సూపర్ స్టార్ రజినీ కాంత్ చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వెట్టయన్. టీజె జ్ఙానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింట్ శర వేగంగా జరుగుతోంది. ఇక ఈక్రమంలోనే ఓ ఫైట్‌ సీన్‌ కోసం… కడపలోని నాపరాయి గనుల్లో రెండు రోజుల చిత్రీకరణకు ప్లాన్ చేశారు ఈ మూవీ మేకర్స్. ఇక ప్లాన్‌కు అనుగుణంగానే కడపలో ఈ సీన్లను చిత్రీకరించారు మేకర్స్. ఇక రజినీ కాంత్ రాక.. అక్కడున్న స్థానికులకు తెలియండంతో.. ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున క్వారీకి చేరుంటున్నారు. రజినీ తమ అరుపులతో స్వాగతం పలుకుతూనే.. ఆయనతో ఒక్క ఫోటో కోసం ఆరాటపడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos