Mahesh Babu: జక్కన్నతో సినిమా అంటే జైలే.! ఫ్యాన్‌తో మహేష్ ములాఖాత్..
రాజమౌళి సినిమా అంటే హీరోలకు ఆల్మోస్ట్ జైలుతో సమానం. అందులోకి వెళ్లేముందే బ్యాలెన్స్ పనులేమైనా ఉంటే చేసేయాలి.. చూడాలనుకున్నవి చూసేయాలి.. మాట్లాడేదుంటే మాట్లాడేయాలి..? ఇంత బిల్డప్ అవసరమా అనుకోవచ్చు.. కానీ అదే నిజం. మహేష్ కూడా ఇదే చేస్తున్నారిప్పుడు. జక్కన్న ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందే చేయాల్సిన పనులు కొన్ని చేస్తున్నారు. ఆయనేం చేస్తున్నారో ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.
రాజమౌళి సినిమా అంటే హీరోలకు ఆల్మోస్ట్ జైలుతో సమానం. అందులోకి వెళ్లేముందే బ్యాలెన్స్ పనులేమైనా ఉంటే చేసేయాలి.. చూడాలనుకున్నవి చూసేయాలి.. మాట్లాడేదుంటే మాట్లాడేయాలి..? ఇంత బిల్డప్ అవసరమా అనుకోవచ్చు.. కానీ అదే నిజం. మహేష్ కూడా ఇదే చేస్తున్నారిప్పుడు. జక్కన్న ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందే చేయాల్సిన పనులు కొన్ని చేస్తున్నారు. ఆయనేం చేస్తున్నారో ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.. గుంటూరు కారమే తనకు చివరి తెలుగు సినిమా అని ముందుగానే ఫిక్సైపోయారు మహేష్ బాబు. అందుకే అందులో ఫ్యాన్స్‌కు ఏమేం కావాలో గుర్తు పెట్టుకుని మరీ వడ్డీతో సహా ఇచ్చేసారు. డాన్సులైనా, డైలాగులైనా, పాటలైనా ఏం చేసినా ఇప్పుడే.. రాజమౌళి సినిమా తర్వాత అంతా అంతర్జాతీయమే అని ఫ్యూచర్‌ను ముందే ఊహించేసారు సూపర్ స్టార్. పాన్ ఇండియన్ సినిమాలు చేసే ఛాన్స్ వచ్చినా.. రాజమౌళి కోసమే ఇన్నేళ్లూ వెయిట్ చేసారు మహేష్. ఈ సినిమాతో కొడితే కుంభస్థలమే అన్నట్లు.. ఏకంగా గ్లోబల్ ఇమేజ్ కోసం చూస్తున్నారు మహేష్. ఆ రేంజ్ కావాలని కల కంటున్నపుడు.. పడే కష్టం కూడా అలాగే ఉండాలిగా..! అందుకే జక్కన్న కోసం మూడేళ్లు రాసిచ్చేస్తున్నారు సూపర్ స్టార్. కాకపోతే ఆ లోపు కొన్ని పనులు పూర్తి చేయాలని చూస్తున్నారీయన.
అన్నీ కుదిర్తే సమ్మర్ తర్వాత మహేష్ బాబు, రాజమౌళి సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈలోపు కొన్ని కమిట్‌మెంట్స్ పూర్తి చేయనున్నారు మహేష్. అందులో తను సైన్ చేసిన కమర్షియల్స్ ఉన్నాయి. వీటిని త్వరలోనే పూర్తి చేయనున్నారు మహేష్. అక్కడే ఫ్యాన్స్ మీట్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు సూపర్ స్టార్. జక్కన్న సినిమాకు ముందే అభిమానులతో మనసువిప్పి మాట్లాడనున్నారు మహేష్. ఒక్కసారి రాజమౌళి సినిమా షూటింగ్ మొదలైతే బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు. పైగా మూడేళ్ళ తర్వాత కానీ తన నుంచి సినిమా రాదు. అందుకే ఫ్యాన్స్‌ను కలిసి.. సలహాలు, సూచనలు తీసుకోనున్నారు మహేష్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..