సుక్కు కూతురంటే.. నేషనల్ కాదు ఇంటర్నేషనల్

|

Jan 04, 2025 | 3:13 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సుకుమార్. ఆర్య తో మొదలైన ఆయన ప్రయాణం పుష్ప 2తో పీక్స్ కు చేరింది. కేవలం దర్శకుడిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా తన స్టామినా ఏంటో చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయన కూతురు సుకృతి వేణి కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడిచేందుకు రెడీ అయిపోయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు.

పద్మావతి మల్లాది ఈ సినిమాను తెరకెక్కించారు. సుకుమార్‌ రైటింగ్స్, గోపీటాకీస్‌ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు ఈ సినిమాను నిర్మించారు. సుకుమార్ భార్య, శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పకురాలుగా వ్యవహరించారు. రిలీజ్ కు ముందే గాంధీ తాత చెట్టు రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ సినిమా ఎన్నో అవార్డులు కూడా కైవసం చేసుకుంది. ఇక ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా అవార్డు అందుకుంది. దీంతో సుకుమార్ కూతురిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సుక్కు కూతురంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్‌నేషనల్ అని అంతా తెగ పొగిడేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక్కడోళ్లు తిడుతున్నారని.. హిందీ హీరోయిన్ల జాతకం చెబుతున్నావా సామి ??

అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తుకొచ్చారు

మీరు మూర్ఖులైతే ఈ సినిమాను OTTలో చూడండి