ఈవెంట్‌లో సీనియర్ నటికి పూనకం.. వైరల్ వీడియో

Updated on: Jan 07, 2026 | 4:40 PM

నటి సుధా చంద్రన్ జీవితం స్ఫూర్తిదాయకం. కాలు కోల్పోయినా 'మయూరి' చిత్రంతో డ్యాన్సర్‌గా గుర్తింపు పొందారు. ఇటీవల ఓ భజన కార్యక్రమంలో ఆమె పూనకంతో ఊగిపోయిన వీడియో వైరల్ అయింది. తనను ఆపడానికి ప్రయత్నించిన భక్తుడిని కొరకడానికి ప్రయత్నించడం నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. దీనిపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

సుధా చంద్రన్.. ఇప్పటి జనరేషన్ కు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ 1990 జనరేషన్ కు ఈమె బాగా తెలుసు. ఒక రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆమె.. పట్టుదలతో క్లాసికల్ డ్యాన్సర్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఆమె జీవిత కథ ఆధారంగా ‘మయూరి’ అనే సినిమా కూడా వచ్చింది. ఇందులో ఆమెనే స్వయంగా నటించి అందర్నీ మెప్పించింది. ఇప్పుడు పలు సీరియల్స్‌లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలో నటి సుధా చంద్రన్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఓ భజన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఉన్నట్టుండి పూనకం వచ్చినట్టు ప్రవర్తించడం అందర్నీ షాకయ్యేలా చేసింది. రీసెంట్‌గా ఓ ఆధ్యాత్మిక ఈవెంట్‌కు వెళ్లిన సుధా.. అందరితో పాటు భజనలో పాల్గొంది.. ఈక్రమంలోనే ఉన్నట్టుండి తన్మయత్వానికి గురై.. పూనకంతో ఊగిపోయింది. ఇది గమనించిన చుట్టు పక్కల వారు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో తనను పట్టుకోవడానికి వచ్చిన ఒక భక్తుడి చేతిని ఆమె బలంగా కొరకడానికి ప్రయత్నించింది సుధా. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో ఆమె ప్రవర్తనను చూసి భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెస్సీ Vs రొనాల్డో ‘వెయ్యి గోల్స్’ మొనగాడు ఎవరు ??

గోదావరిలో పడవలతో చిరంజీవి పేరు.. ఆకట్టుకున్న దృశ్యం

Sravana Bhargavi: భాగస్వామి సపోర్ట్‌ లేనప్పుడు.. ఇలాగే జరుగుతుంది !!

సర్కారు వారి మాట కోసం సంక్రాంతి సినిమాల వెయిటింగ్

Bala Krishna: NBK111 సినిమాపై ఇంట్రెస్టింగ్ విషయాలు.. నిజంగా అలా ఉండబోతుందా