AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopichand Malineni-balayya: బాలయ్య కోసం జైలుకెళ్లిన స్టార్‌ డైరెక్టర్‌.. NBK అంటే ఒక వైబ్రేషన్ ,ఒక ఎనర్జీ ,ఒక విస్ఫోటనం..!(వీడియో)

Gopichand Malineni-balayya: బాలయ్య కోసం జైలుకెళ్లిన స్టార్‌ డైరెక్టర్‌.. NBK అంటే ఒక వైబ్రేషన్ ,ఒక ఎనర్జీ ,ఒక విస్ఫోటనం..!(వీడియో)

Anil kumar poka
|

Updated on: Dec 11, 2021 | 4:00 PM

Share

NBK అంటే ఒక వైబ్రేషన్..! NBK అంటే ఒక ఎనర్జీ..! NBK అంటే ఒక విస్ఫోటనం..! ఈ మాటలు బాలయ్యను ఆరాధించే అభిమానులు అన్న మాటలు కాదు. టాలీవుడ్‌ లో క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఓ డైరెక్టర్‌ అన్న మాటలు.


NBK అంటే ఒక వైబ్రేషన్..! NBK అంటే ఒక ఎనర్జీ..! NBK అంటే ఒక విస్ఫోటనం..! ఈ మాటలు బాలయ్యను ఆరాధించే అభిమానులు అన్న మాటలు కాదు. టాలీవుడ్‌ లో క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఓ డైరెక్టర్‌ అన్న మాటలు. బాలయ్యను మూడు ముక్కల్లో డిస్క్రైబ్‌ చేస్తూ గోపిచంద్‌ పేల్చిన మాటల తూటాలు. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్ చేసిన యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని… బాలయ్య గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ.. బాలయ్య అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. స్వతహాగా బాలయ్య హార్డ్‌కోర్ అభిమాని అయిన గోపీచంద్ మలినేని రీసెంట్గా జరిగిన ఈవెంట్లో బాలయ్య అంటే వైబ్రేషన్.. ఎనర్జీ.. విస్పోటనం అంటూ కొన్ని క్రేజీ వ్యాఖ్యలు చేశారు.క్రేజీ వ్యాఖ్యలు చేయడమే కాదు బాలయ్య ‘సమరసింహా రెడ్డి’ సినిమా టిక్కెట్ల కోసం రెండు రోజులు ఒంగోలు జైల్లో లో ఉన్నానని అప్పటి జ్ఙాపకాలను బాలయ్య, బాలయ్య అభిమానులతో పంచుకున్నారు. ‘నేనుకూడా డిసెంబర్ 2 కోసం వెయిట్ చేస్తున్నా… సినిమా దద్దరిల్లిపోవాల్సిందంతే’ అంటూ ఫ్యాన్‌ మేడ్‌ కంమెట్స్‌ చేశారు గోపీచంద్‌ మలినేని. అయితే బాలయ్యతో తాను తీసే సినిమా గురించి మాత్రం ఫ్యాన్స్‌కు ఎలాంటి హింట్ ఇవ్వలేదు ఈ క్రాక్‌ డైరెక్టర్.

Published on: Dec 11, 2021 03:56 PM
Follow Us