Tillu Square: OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
మొన్నటివరకు థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సినిమా టిల్లు స్క్వేర్. ఎప్పటిలాగే తనదైన పంచులు, డైలాగ్ డెలివరీతో అలరించాడు యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. అతి తక్కువ సమయంలోనే దాదాపు 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.

అటు యూఎస్ మార్కెట్ లోనూ స్టార్ హీరో రేంజ్ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు మూవీ లవర్స్. ఇక ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ. టిల్లు స్క్వేర్ డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ క్రేజీ రైడ్ మూవీ పాన్ ఇండియా భాషల్లో అందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది. ఏప్రిల్ 26 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రానికి రామ్ మిర్యాల, భీమ్స్ సంగీతం అందించారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. టిల్లు స్క్వేర్ హిట్ కావడంతో ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేశారు. టిల్లు క్యూబ్ త్వరలోనే ప్రకటించనున్నామని తెలిపారు మేకర్స్. అలాగే ఇందులో నటీనటుల వివరాలను కూడా వెల్లడించనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.