Shruti Haasan: ప్రస్తుతం నేను ఆ సమస్యలతో పోరాటం చేస్తున్నా..! మానసికంగా దృఢంగా ఉన్నా.: శ్రుతి హాసన్
ప్రస్తుతం తాను పలు హార్మోన‍్ల సమస్యతో బాధపడుతున్నానంటూ వర్కౌట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్. ఈ మేరకు ఆమె బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో
ప్రస్తుతం తాను పలు హార్మోన‍్ల సమస్యతో బాధపడుతున్నానంటూ వర్కౌట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్. ఈ మేరకు ఆమె బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘శారీరకంగా వీక్‌గా ఉన్నాను.. కానీ మానసికంగా మాత్రం చాలా దృఢంగా ఉన్నాను’ అని పేర్కొంది. ఈ సందర్భంగా శ్రుతి హాసన్ ఇలా రాసుకొచ్చింది. ‘ప్రస్తుతం నేను పీసీఓఎస్, ఎండోమెట్రియాసిస్ సమస్యల్ని ఎందుర్కొంటున్నా. వీటి నుంచి బయటపడేందుకు పోరాటం చేస్తున్నా. హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో ప్రతి మహిళకు తెలుసు. ఇది మహిళల మెటబోలిజంపై ప్రభావం చూపుతుంది. అయితే నేను దీని గురించి విచారించకుండా సాధారణంగానే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా. ఇందు కోసం సమయానికి తినడం, సరిపడా నిద్రపోవడంతో పాటు ప్రతి రోజూ వ్యాయమం చేస్తున్నా. ఇలా చేయడం వల్ల మానసికంగా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. అందరు ఇలాంటి సమస్యలను బయటకు చెప్పేందుకు సంకోచిస్తుంటారు.. కానీ ఇలాంటి సవాళ్లను మనం ధైర్యంగా స్వీకరించాలి. ఎందుకంటే ఇవి మన జీవితాన్ని డిఫైన్ చేయకూడదు. అందుకే నేను మీతో ఈ విషయాన్ని పంచుకోవాలనుకున్నా’ అంటూ శ్రుతి రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం శ్రుతి హాసన్ సలార్ మూవీతో పాటు బాలకృష్ణ ఎన్‌బీకే107 చిత్రంలో నటిస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..