Sharwanand: టర్న్ అవనున్న శర్వానంద్ టైమ్.. ఇక తగ్గేదేలే

Edited By:

Updated on: Oct 22, 2025 | 1:47 PM

శర్వానంద్ టైమ్ టర్న్ అయిందా..? ఆగిపోయినవి, వాయిదా పడినవి, కొన్నాళ్లుగా కదలకుండా ఉన్నవి.. అన్ని సినిమాల్లోనూ ఒకేసారి కదలిక వచ్చిందా..? అసలేం జరుగుతుంది శర్వా కెరీర్ విషయంలో..? సంక్రాంతికి ఒకటి.. సమ్మర్‌కు ఒకటి అంటూ ప్లాన్ చేస్తున్నారా..? అసలీయన సినిమాలేంటి..? అందులో ఈయన్ని బయటపడేసే ప్రాజెక్ట్ ఏంటి..? ఒకప్పుడు వరస విజయాలతో సేఫ్ జోన్‌లో ఉన్న హీరో శర్వానంద్.

కానీ కొన్నేళ్లుగా ఈయన కెరీర్ పూర్తిగా గాడి తప్పింది. ఎంతలా అంటే అసలు గ్యాపే తీసుకుని శర్వాకు ఏడాదికి పైగా గ్యాప్ వచ్చేంతలా..! మనమే తర్వాత ఈ హీరో నుంచి సినిమాలేం రాలేదు. చేతిలో మూడు నాలుగు సినిమాలున్నా ముందుకు కదలడం లేదు. వీటన్నింటిపై దివాళికి అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. శర్వా ప్రస్తుతం నటిస్తున్న నారి నారి నడుమ మురారి సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. సామజవరగమనా లాంటి ఎంటర్‌టైనర్ అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజు నుంచి వస్తున్న సినిమా ఇది. సంక్రాంతికి దీన్ని విడుదల చేయబోతున్నారు. అలాగే యువీ క్రియేషన్స్‌లో చేస్తున్న సినిమాకు బైకర్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. సంపత్ నందితో భోగి సినిమాను ఈ మధ్యే మళ్లీ మొదలు పెట్టారు శర్వా. అప్పట్లో వరస విజయాలు అందుకున్న శర్వా.. ఆ తర్వాత పూర్తిగా ట్రాక్ తప్పారు. మనమే తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. కథల విషయంలోనూ జాగ్రత్తగా ఉంటున్నారు ఈ హీరో. భోగితో మాస్.. నారినారి నడమ మురారితో ఫ్యామిలీస్‌.. బైకర్‌తో యూత్‌ను ఒకేసారి మాయ చేయాలని చూస్తున్నారు శర్వానంద్. మరి వీళ్లకు హిట్ ఎప్పుడొస్తుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Naveen Polisetty: ప్రమోషన్ తో కుమ్మేస్తున్న నవీన్ పోలిశెట్టి..

Bahubali: బాహుబలి ఎపిక్.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. మరల బాక్సాఫీస్ బద్దలే

Published on: Oct 22, 2025 01:46 PM