Polimera 2: పొలిమేర 2లో బూతు సీన్లు.. ఝలక్‌ ఇచ్చిన సెన్సార్ బోర్డ్‌.. వీడియో.

|

Nov 02, 2023 | 12:33 PM

పొలిమేర 1 సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పొలిమే2.. ఇప్పుడో బిగ్ ఫిల్మ్ గా టర్న్ అయింది. బడా ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ సినిమాను సపొర్ట్‌ చేయడంతో.. ఈ సినిమా గ్రాండ్ స్పాన్‌లో రిలీజ్‌ కానుంది. ఇదే ఈ మూవీ మేకర్స్‌ను ఫిదా అయ్యేలా కూడా చేసింది. కానీ ఈ ఫిదా ఎంతో కాలం నిలవక ముందే... సెన్సార్‌ బోర్డ్‌ ఈ సినిమా మేకర్స్‌కు బిగ్ ఝలక్‌ ఇచ్చేసింది. చిన్న సినిమాగా.. రిలీజ్ అయిన పొలిమేర1, మంచి టాక్ తెచ్చుకుంది. తెలుగు ఆడియెన్స్‌కు థ్రిల్‌ నిచ్చింది.

పొలిమేర 1 సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పొలిమే2.. ఇప్పుడో బిగ్ ఫిల్మ్ గా టర్న్ అయింది. బడా ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ సినిమాను సపొర్ట్‌ చేయడంతో.. ఈ సినిమా గ్రాండ్ స్పాన్‌లో రిలీజ్‌ కానుంది. ఇదే ఈ మూవీ మేకర్స్‌ను ఫిదా అయ్యేలా కూడా చేసింది. కానీ ఈ ఫిదా ఎంతో కాలం నిలవక ముందే… సెన్సార్‌ బోర్డ్‌ ఈ సినిమా మేకర్స్‌కు బిగ్ ఝలక్‌ ఇచ్చేసింది. చిన్న సినిమాగా.. రిలీజ్ అయిన పొలిమేర1, మంచి టాక్ తెచ్చుకుంది. తెలుగు ఆడియెన్స్‌కు థ్రిల్‌ నిచ్చింది. దీంతో ఈ మూవీ సీక్వెల్‌గా… పొలిమేర2 తెరపైకి వస్తోంది. రీసెంట్ గా రిలీజ్‌ అయిన టీజర్‌తో .. ట్రైలర్‌తో… వీటి కారణంగా సినిమాపై పెరిగిన అంచనాలతో.. ఈసినిమా నవంబర్ 3న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది.  కానీ ఈ క్రమంలోనే ఈ సినిమా సెన్సార్‌ బోర్డ్‌ దగ్గర కోతకు గురైందనే టాక్ ఇండస్ట్రీ నుంచి వస్తోంది.

సత్యం రాజేష్ లీడ్‌లో.. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్‌ తెరకెక్కించిన పొలిమేర2 సినిమా.. పొలిమేర1 సినిమాలాగే.. మధ్య మధ్యలో బోల్డ్‌ సీన్లతో.. బూతు మాటలతో ఉందట. అయితే పొలిమేర1 ఓటీటీ సినిమా కావడంతో సెన్సార్‌ కట్స్‌ లేకుండా బయటికి వచ్చింది. కానీ పొలిమేర 2 సినిమా థియేటర్‌ రిలీజ్ అవుతుండడంతో.. తాజాగా ఈ సినిమాలోని కొన్ని అడాల్ట్ సీన్లకు.. బూతు మాటలకు.. కట్ చెప్పిందట సెన్సార్ బోర్డ్‌. అయితే ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ఎక్స్‌పెక్ట్ చేసిన ఈ మూవీ మేకర్స్.. సెన్సార్‌ బోర్డ్.. కొన్ని సీన్లు తీసేయాలంటూ ఝలక్‌ ఇవ్వడంతో.. చేసేదేం లేక.. ఏ సర్టిఫికేట్‌ అయినా పర్లేదు ఆ సీన్స్‌ కట్ చేయలేమంటూ.. బోర్డ్‌తో చెప్పారట. ఇలా బోర్డ్‌తో చాలా డిస్కషన్ తర్వాత.. బోర్డ్‌ సభ్యులు ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్‌నే జారీ చేశారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos