పోలీసులకు సంధ్యా థియేటర్‌ నుంచి ఘాటు రిప్లయ్

|

Dec 31, 2024 | 12:13 PM

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై థియేటర్ యాజమాన్యానికి అప్పట్లో పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే తాజాగా పోలీసులు పంపిన ఈ నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఏకంగా 6 పేజీల్లో తమ వివరణను రాసి పోలీసులకు పంపించింది. సంధ్య థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని మొత్తం ఆరు పేజీల లేఖను పంపింది సంధ్య థియేటర్‌ యాజమాన్యం.

డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షోకు మొత్తం 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని తమ లేఖలో పేర్కొంది. 4,5 తేదీల్లో హాల్‌ను మైత్రి మూవీస్‌ బుక్‌ చేసుకుందని.. తెలిపింది. వాహనాల కోసం థియేటర్‌లో ప్రత్యేక పార్కింగ్‌ ఉందని.. గత 45 ఏళ్లుగా థియేటర్‌ను రన్‌ చేస్తున్నామని.. గతంలోనూ హీరోలు థియేటర్‌కు వచ్చారు కానీ.. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదంటూ తన వివరణ పత్రంలో రాసుకొచ్చింది. అయితే సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు పంపిన ఈ లెటర్‌ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పోలీసులకు సంధ్యా థియేటర్‌ ఇచ్చిన ఘాటు రిప్లై ఇది అనే ట్యాగ్‌తో కామెంట్‌తో సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వారసత్వం కాదు.. పనితనం !! అన్నకు మంత్రి పదవిపై పవన్‌ కామెంట్స్

చరణ్ సినిమా ఈవెంట్‌కు పవన్‌ ?? దిల్ రాజు పర్సనల్ రిక్వెస్ట్

అక్కినేనిపై మోదీ ప్రశంసల వర్షం !!

గోటితో పోయేదానికి గొడ్డలి దాకానా.. చురకలంటించిన పవన్‌ కళ్యాణ్‌

అన్ స్టాపబుల్ షోకు గ్లోబల్ స్టార్.. బాలయ్య, చరణ్ కాంబో అదుర్స్