AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజ్ నిడిమోరుకు సమంత క్లోజ్ హగ్ కొత్త ప్రయాణం మొదలైందా

రాజ్ నిడిమోరుకు సమంత క్లోజ్ హగ్ కొత్త ప్రయాణం మొదలైందా

Phani CH
|

Updated on: Nov 09, 2025 | 4:31 PM

Share

టాలీవుడ్ నటి సమంత ఇటీవల రాజ్ నిడిమోరుతో దిగిన ఒక వైరల్ ఫోటో నెట్టింట సంచలనం సృష్టించింది. ఈ ఫోటో వారిద్దరి మధ్య ప్రేమాయణంపై చర్చకు దారితీసింది. తన పెర్ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్ సందర్భంగా షేర్ చేసిన ఈ ఫోటోతో పాటు, గడిచిన ఏడాదిన్నరగా తన కెరీర్ లో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, చిన్న విజయాలు, నిర్మాతగా కొత్త ప్రయాణం గురించి సమంత పంచుకున్నారు.

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇటీవలే శుభం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో అతిథి పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సామ్… డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్ లో ఉన్నారంటూ ఫిల్మ్ నగర్ లో కొంతకాలంగా టాక్ నడుస్తోంది. సమంత శుక్రవారం షేర్ చేసిన ఒక ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇప్పుడీ ఫోటో నెట్టింట చర్చనీయాంశమైంది. అందులో సామ్.. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో క్లోజ్ హగ్ తో కనిపించింది. తన పెర్ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో సమంత దిగిన ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటోతోపాటు పలువురితో దిగిన ఫోటోస్ పంచుకుంటూ తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు సామ్. “ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలో.. గత ఏడాదిన్నరగా తన కెరీర్ లో సాహసోపేతమైన అడుగులు వేశానని.. రిస్క్ తీసుకున్నానని.. ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నానని చెప్పారు. చిన్న విజయాలను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని అన్నారు. ప్రతిభావంతులైన కష్టపడి పనిచేసే వారితో కలిసి పని చేస్తున్నందుకు కృతజ్ఞురాలిని. ఇది కేవలం ఆరంభమే” అంటూ రాసుకొచ్చారు. రాజ్, డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటడెల్ హనీ బన్నీలో సమంత నటించారు. ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని తెలుస్తోంది. ఇన్నాళ్లు హీరోయిన్ గా మెప్పించిన సమంత.. శుభం సినిమాతో నిర్మాతగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండియాలో అదరగొడుతున్న ‘ప్రెడెటర్ బ్యాడ్ ల్యాండ్స్‌

ఆ ఒక్క సీరియల్‌కే కోటికి పైగా సంపాదన హాట్‌ టాపిక్‌గా వంటలక్క ఫీజ్‌

చనిపోయిన తండ్రి జ్ఞాపకాలు మరవలేక

నవంబరులో నింగిలో అన్నీ అద్భుతాలే

సుడిగాడు.. కొంచెం ఉంటే బస్సు చక్రాల కిందే